కేసీఆర్ కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌.. ఎవ‌రికి ఛాన్స్‌…?

June 7, 2019 at 1:00 pm

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌.. త‌న కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నా రు. దాదాపు స్థానిక ఎన్నిక‌లు స‌హా అన్ని ఎన్నిక‌లు పూర్త‌యిన నేప‌థ్యంలో పూర్తిస్థాయిలో త‌న కేబినెట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు, త‌న‌దైన పంథాలో గ‌ళాన్ని వినిపించేవారికి అవ‌కాశం ఇచ్చేందుకు గులాబీ బాస్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే వార్త‌ల నేప‌థ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్ప‌డింది. సామాజిక వ‌ర్గాల ప్రాధాన్యం స‌హా ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి కేసీఆర్ గూటిలో చేరిన వారికి కూడా అవ‌కాశం ఇవ్వాల‌నే దృక్ఫ‌థంతో కేసీఆర్ ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో కేబినెట్ మార్పు, చేర్పుల‌పై ఆస‌క్తి నెల‌కొంది.

విష‌యంలోకి వెళ్తే.. కేసీఆర్ ప్ర‌భుత్వం గ‌త ఏడాది డిసెంబ‌రులో ఏర్పాటైంది. తాను సీఎంగా, త‌న‌తోపాటు ముస్లి వ‌ర్గానికి చెందిన మ‌హ‌మూద్ అలీని ఉప‌మంత్రిగా చేసుకుని ఏర్పాటు చేసుకున్న కేసీఆర్‌.. దాదాపు నెల రోజుల త‌ర్వాత కొంద‌రు ముఖ్యుల‌తో కేబినెట్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే, తాజాగా పార్ల‌మెంటు ఎన్నిక‌లు, అదేవిధంగా స్తానిక సంస్థ‌ల ఎ న్నిక‌లు కూడా రాష్ట్రంలో ముగిశాయి. ఈ నేప‌థ్యంలో త‌న బృందాన్ని ప‌టిష్ట ప‌రుచుకుని, పాల‌న‌పై ప‌ట్టు పెంచుకునేం దుకు కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాబోయే వారంలోనే కేసీఆర్ త‌న మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

వీరిలో కాంగ్రెస్ నుంచి కొత్త‌గూడెంలో విజ‌యం సాధించిన వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు, టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌లు త‌ర్వాత కాలంలో కేసీఆర్ గూటికి చేరిపోయారు. దీంతో వీరిద్ద‌రికీ ఛాన్స్ ఉంటుంద‌ని భావిస్తున్నారు. అదేస‌మ‌యంలో కాంగ్రెస్‌నుంచి భారీ ఎత్తున దాదాపు 12 మందిని పార్టీలో చేర్చుకున్న(ఏకంగా సీఎల్పీ టీఆర్ ఎస్ ఎల్పీలో విలీనం అయిపోయింది) నేప‌థ్యంలో వీరిలో ఒక‌రిద్ద‌రికి కూడా ఛాన్స్ ఉండే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ప్ర‌ధానంగా త‌న కేబినెట్‌లో మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఈ అప‌వాదును పోగోట్టుకునేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటున్నారు.

ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ నుంచి గెలిచిన మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డిని పార్టీలోకి చేర్చుకున్న కేసీఆర్ ఆమెకు త‌ప్ప కుండా త‌న కేబినెట్‌లో ఛాన్స్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అదేవిధంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కొంద‌రు మంత్రులు ఇప్పుడున్న వారు ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించార‌ని అంటున్నారు. వారిని ప‌క్క‌కు పెట్టి.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీకి విజ‌యం చేకూర్చేలా వ్య‌వ‌హ‌రించిన వారికి కేసీఆర్ ప‌ట్టం క‌డ‌తార‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రికి ఛాన్స్ ద‌క్కుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. మ‌రి గులాబీ బాస్ ఏం చేస్తారో చూడాలి.

కేసీఆర్ కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌.. ఎవ‌రికి ఛాన్స్‌…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts