90ఏండ్ల క్రిత‌మే ఇండియన్ స్క్రీన్ పై లిప్‌లాక్‌…!

June 12, 2019 at 11:45 am

లిప్‌లాక్ సీన్‌లో హీరోహీరోయిన్‌లు క‌నిపిస్తే థియోట‌ర్ల‌లో ఈల‌లే ఈల‌లు. ఈ లిప్‌లాక్ సీన్ వ‌చ్చిందంటే యువ‌త‌రం న‌రాల్లో ఎక్క‌డ‌లేని ఉత్కంఠ‌, ఎమోష‌న్ వ‌స్తుంది… అందుకే యువ‌త నుంచి పండు ముస‌లి వ‌ర‌కు ఆక‌ట్టుకోవాలంటే ఈ లిప్‌లాక్ సీన్ ను ద‌ర్శ‌కుడు త‌ప్ప‌నిస‌రిగా పెడుతున్నారు. ఈ లిప్‌లాక్ లేనిదే సినిమా రూపొందించ‌డం లేదంటే న‌మ్మ‌క‌శ్యం కాదు. హీరోయిన్లు కూడా లిప్‌లాక్‌కు ఎలాంటి జంకు లేకుండా సై అంటున్నారు.

అయితే ఈ లిప్‌లాక్ పుట్టింది ఇప్పుడే కాదు. లిప్‌లాక్ పుట్టింది కూడా హాలీవుడ్‌లో కాదండి సుమా. ఈ లిప్‌లాక్ పుట్టి 90ఏండ్లు అవుతుంది. లిప్‌లాక్ పుట్టింది కూడా ఇండియ‌న్ సినిమాలో. 1929లో ఇండియాలో వ‌చ్చిన మూకీ సినిమా ఏ ధ్రో ఆఫ్ డైస్ అనే సినిమాలో మొద‌టిసారి లిప్‌లాక్ సీన్‌ను చిత్ర‌సీమ‌కు ప‌రిచయం చేసింది ఓ ఇండియ‌న్ ద‌ర్శ‌కుడు. ఇది న‌మ్మ‌లేని నిజం అయిన‌ప్ప‌టికి లిప్‌లాక్ సృష్టిక‌ర్త‌లు ఇండియ‌న్ చిత్ర‌సీమ కావ‌డం ఓ విశేష‌మే మ‌రి.

మ‌హాభారతం ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో తీసిన చిత్రంలో సీతాదేవి, చారురాయ్ అనే న‌టీన‌టులు కొన్ని క్ష‌ణాల పాటు పెద‌వులు క‌లుపుకున్నారు. కాని 1930లో వ‌చ్చిన క‌ర్మ సినిమాలో మాత్రం పూర్తిస్ఠాయి లిప్‌లాక్‌ను చిత్రించారు. నిజ‌జీవితంలో భార్య‌భ‌ర్త‌లైన దేవికారాణి, హిమాన్షురాయ్‌లు రీల్ జీవితంలో ప్రేమికులుగా న‌టించారు. ఓ స‌న్నివేశంలో ఇద్ద‌రు లిప్‌లాక్‌ను ఏకంగా నాలుగు నిమిషాలు సీన్‌లో న‌టించారు. అలా లిప్‌లాక్ సీన్‌ను క‌నిపెట్టి, సిని జ‌నాల‌కు ప‌రిచ‌యం చేసి ఇప్ప‌టికి 90ఏండ్లు పూర్తి అయింది.

90ఏండ్ల క్రిత‌మే ఇండియన్ స్క్రీన్ పై లిప్‌లాక్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts