జ‌గ‌న్‌కి మోడీ బంపర్ ఆఫర్..!

June 12, 2019 at 10:43 am

అటు కేంద్రంలో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చింది. ఇటు ఏపీలో వైసీపీ కూడా అదే రేంజ్‌లో అధికారం ద‌క్కించుకుంది. అయితే, ఈ రెండు పార్టీలు కూడా ఇప్ప‌టి వ‌ర‌కు నేరుగా ఒక‌టే జ‌ట్టుగా ఎక్క‌డా ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది లేదు. ఎప్పుడూ ముభావంగానే ఈ రెండు పార్టీలు ముందుకు సాగాయి. అయితే, ఇప్పుడు గెలిచిన త‌ర్వాత మాత్రం బీజేపీ.. నేత‌లు వైసీపీకి చేరువ‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ.. ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌ట్ల ఎంతో ప్రేమ‌ను కురిపిస్తున్నారు. ఇది రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌స్తోంది. తాను ఇంకా సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌కుండానే జ‌గ‌న్‌.. నేరుగా ఢిల్లీకి వెళ్లి.. మోడీని క‌లిసి వ‌చ్చారు.

ఏపీ స‌మ‌స్య‌ల‌ను ఆయ‌నకు వివ‌రించాన‌ని చెప్పారు. అదేస‌మ‌యంలో కేంద్రంలోని ప్ర‌భుత్వానికి 250 సీట్ల‌కు మించ‌రాద ని తాను దేవుణ్ని కోరుకున్న‌ట్టు చెప్పారు. నిజానికి జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై క‌ల‌క‌లం రేగుతుంద‌ని, బీజేపీ నేత‌లు ఫైర్ అవుతార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అలా ఏమీ జర‌గ‌లేదు. పైగా ప్ర‌ధాని ప్ర‌మాణ స్వీకారానికి జ‌గ‌న్ వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుని చివ‌రి నిముషంలో విమానాల ల్యాండింగ్ స‌మ‌స్య కార‌ణంగా విర‌మించుకున్నారు. ఇక‌, తాజాగా ఇటీవ‌ల తిరుమ‌ల‌కు వ‌చ్చిన ప్ర‌ధాని మోడీకి-జ‌గ‌న్‌కు మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. విమానాశ్ర‌యంలో మోడీ విమానం నుంచి దిగ‌డంతోనే ఆయ‌న‌కు ఆహ్వానం ప‌లికారు జ‌గ‌న్‌.

అదేస‌మ‌యంలో ప్ర‌ధాని మోడీకి పాదాభివంద‌నం చేసేందుకు రెండుసార్లు కింద‌కి వంగేందుకు ప్ర‌య‌త్నించ‌డం, ప్ర‌ధా ని హోదాలో మోడీ వారించ‌డం తెలిసిందే. ఇది రాజ‌కీయంగా అనేక వ్యాఖ్య‌ల‌కు అవ‌కాశం ఇచ్చింది. నిజానికి టీడీపీ గ‌త 2014 ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి ప్ర‌యాణించింది. ఆ త‌ర్వాత నాలుగేళ్ల‌కు ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ గ్యాప్‌లో వైసీపీ బీజేపీకి చేరువ‌య్యింద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. కానీ, ఎక్క‌డా కూడా బ‌య‌ట ప‌డ‌కుండా మెయింటెన్ చేస్తూ వ‌చ్చారు వైసీపీ నాయ‌కులు. తాజాగా జ‌రిగిన ఈ విష‌యాలు చూస్తే.. బీజేపీతో వైసీపీ చాలా రోజుల నుంచే అప్ర‌క‌టిత పొత్తు కొన‌సాగిస్తున్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది.

తిరుప‌తిలో నిర్వ‌మించిన బీజేపీ స‌భ‌లోనూ మోడీ.. దాదాపు ఇలానే వ్యాఖ్యానించారు. ఏపీలో జ‌గ‌న్ బ‌ల‌మైన ప్ర‌భుత్వం ఏర్పాటు చేశారంటూ.. ఆయ‌నను కొనియాడారు. తిరుమ‌ల శ్రీవారం ద‌ర్శ‌నం స‌మ‌యంలో రెండు నిమిషాలు ఆల‌స్యం గా వ‌చ్చిన సీఎం జ‌గ‌న్ కోసం మోడీ త‌న కారు వ‌ద్దే వెయిట్ చేశారు. వీటిని ప‌రిశీలిస్తున్న రాజ‌కీయ విశ్లేష‌కులకు మోడీ వ్యూహాత్మ‌కంగా జ‌గ‌న్‌తో సంబంధం ఏర్పాటు చేసుకుంటున్నార‌ని అంటున్నారు. తాజాగా ఇప్పుడు పార్ల‌మెంటులో డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని ఇస్తానంటూ.. జ‌గ‌న్ కు మోడీ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజానికి ఎన్డీయేలో ఉన్న చాలా పార్టీలు ప‌ద‌వుల కోసం వెంప‌ర్లాడుతున్నాయి.

ముఖ్యంగా బిహార్ అధికార పార్టీ జేడీయూ రెండు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌లేద‌ని అలిగి మోడీతో అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. అలాంటి పార్టీని కూడా వ‌దులుకుని.. ఎన్డీయేతో ఏమాత్రం సంబంధం లేని జ‌గ‌న్‌..ను ఇప్పుడు మోడీ త‌న కూట‌మి లోకి ఆహ్వానించ‌డం, ఏకంగా రాజ్యాంగ బ‌ద్ధ‌ప‌ద‌వి అయిన డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని ఇస్తాన‌ని ఆఫ‌ర్ ఇవ్వ‌డం వెనుక చాలానే రాజ‌కీయం ఉంద‌ని అంటున్నారు. త‌న గుప్పిట్లో జ‌గ‌న్‌ను బంధించ‌డం ద్వారా ఏపీలోనూ బీజేపీ ఎదుగుద‌ల‌కు మోడీ పావులు క‌దుపుతున్నారా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. మ‌రి ఈ ఆఫ‌ర్‌ను జ‌గ‌న్ తీసుకుంటారా? లేదా.. ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన ఆఫ‌ర్‌ను ఉప‌యోగించుకుని ఏపీకి ప్ర‌త్యేక‌హోదా డిమాండ్‌ను సాధిస్తారా? .. ఏం జ‌రుగుతుందో చూడాలి.

జ‌గ‌న్‌కి మోడీ బంపర్ ఆఫర్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts