కేంద్రం,తెలంగాణ‌ న‌డుమ జ‌గ‌న్‌.. ఫ్యూచ‌ర్ ఏంటి…!

June 4, 2019 at 11:38 am

రాష్ట్రంలో అధికారం మారింది. యువ నాయ‌కుడు, మాజీ సీఎం రాజ‌శేఖ‌ర‌రెడ్డి వార‌సుడిగా వ‌చ్చిన వైఎస్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. అయితే,సాధార‌ణంగా మిగిలిన రాష్ట్రాల ప‌రిస్థితి ఎలా ఉన్నా.. విభ‌జ‌న త‌ర్వాత ఏపీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. అస‌లు రాష్ట్రం ప్రారంభంలోనే 16 వేల కోట్ల లోటు బ‌డ్జెట్‌తో ఏర్ప‌డింది. ఇక, ఇప్పుడున్న లోటును గ‌మ‌నిస్తే.. ఇది 2.66 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది. దీనిలో అప్పులు కూడా ఉన్నాయి. మొత్తానికి ఏడాదికి దాదాపు 10 వేల కోట్ల వ‌ర‌కు వ‌డ్డీల రూ పంలో చెల్లించాల్సి వ‌స్తోంద‌ని సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం అనంత‌రం జ‌గ‌న్ వెల్ల‌డించిన దానిని బ‌ట్టి తెలుస్తోంది. మిగి లిన వాటిలో అప్పుల రూపంలో ఏడాదికి 20 వేల కోట్ల వ‌ర‌కు చెల్లింపులు చేయాల్సి వ‌స్తోంది.

ఇక‌, రాష్ట్రం విభ‌జ‌నతో రాజ‌ధానిని కోల్పోవ‌డం, పారిశ్రామిక రంగాన్ని ప‌ట్టాలు ఎక్కించ‌డం, కీల‌క‌మైన ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌డంతోపాటు జ‌ల వివాదాలు లేకుండా రాకుండా కూడా చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. గ‌డిచిన ఐదేళ్ల నాటి ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. దాదాపు ప‌దేళ్ల‌పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్‌ను వినియోగించుకోవాల్సి ఉన్నా.. అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు దానిని వ‌దిలి వ‌చ్చారు. ఇక‌, ఆ త‌ర్వాత ఆయ‌న అటు కేంద్రంతోనూ, ఇటు తెలంగాణ రాష్ట్రంతోనూ కూడా స‌ఖ్య‌త‌ను కొన‌సాగించ‌లేక పోయారు. దీంతో రాజ‌కీయంగా చంద్ర‌బాబు, అభివృద్ధి ప‌రంగా రాష్ట్రం కూడా తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి.

ప్ర‌త్యేక హోదాపై ఏపీ ప్ర‌జ‌లు పెట్టుకున్న ఆశ‌ల‌ను చంద్ర‌బాబు త‌న హ‌యాంలో ఇష్టానుసారంగా వినియోగించారు. కొం త సేపు అవ‌స‌రం లేద‌ని, మ‌రికొంత సేపు కావాల‌ని ఆయ‌న చేసిన విన్యాసం.. రాష్ట్రాన్ని నివ్వెర ప‌రిచింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు జ‌గ‌న్ సీఎం పీఠంపై ఉన్నారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ఏపీని ఏం చేస్తారు? అనేది కీల‌క ప్ర‌శ్న‌. కేంద్రం నుంచి రావా ల్సిన నిధులు, హ‌క్కులు సాధించ‌డం, ప‌క్క రాష్ట్రం తెలంగాణాతో స‌ఖ్య‌త‌తో ఉంటూ.. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవ డం అనే కీల‌క అంశాలు ఇప్పుడు జ‌గ‌న్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇక‌, ప్ర‌జ‌ల‌కు ఒకింత సాంత్వన చేకూర్చేలా.. తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ, కేంద్రంలో ఏర్పాటైన న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం కానీ జ‌గ‌న్‌కు అభ‌య హ‌స్తం అందించాయి.

ఇంత వ‌రకు బాగానే ఉంది. అయితే, హైద‌రాబాద్‌లోని రాజ్‌భ‌వ‌న్‌లో ఇఫ్తార్ విందుకు హాజ‌రైన జ‌గ‌న్‌ను అక్క‌డి సీఎం కేసీఆర్ కానీ, గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కానీ ఎంతో ఆద‌రంగా ఆహ్వానించి.. ప్రేమ‌గానే చూసుకున్నారు. దీనిని టీవీల్లో చూసిన ప్ర‌జ‌లు ముచ్చ‌ట‌ప‌డ్డారు. ఇక‌, రాష్ట్రానికి ఇబ్బందిలేద‌ని అనుకున్నారు. అయితే, ఇంత‌లోనే ఓ వార్త ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను క‌ల‌చి వేసింది. హైద‌రాబాద్‌లో ఉమ్మ‌డి ఆస్తులుగా ఉన్న భ‌వ‌నాల్లో ఏపీకి చెందిన భ‌వ‌నాల‌ను తెలంగాణ‌కు ఇచ్చేస్తూ.. జ‌గ‌న్ నిర్ణ‌యించ‌డం, దీనికి గ‌వ‌ర్న‌ర్ కూడా ఓకే చెప్ప‌డం, కేసీఆర్ సంబరం చేసుకోవ‌డం వంటి ప‌రిణామాలు ప్ర‌జ‌ల్లో సందేహాల‌ను నింపాయి.

జ‌గ‌న్ ఇలా సీఎం అయిన వెంట‌నే ఏపీకి చెందిన ఆస్తుల‌ను తెలంగాణ‌కు ఇచ్చేశాడు.. కాబ‌ట్టి.. రాబోయే రోజుల్లో ఇంకేం ఇచ్చేస్తాడో? అనే ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కొంద‌రు మ‌రో అడుగు ముందుకు వేసి.. కేంద్రం లోని మోడీతోనూ ఇలానే వ్య‌వ‌హ‌రిస్తాడా? అని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే, జ‌గ‌న్ వేసిన అడుగుల‌పై మాత్రం మేదావి వ‌ర్గా లు హ్యాపీగానే ఉన్నారు. నిజాయితీగా ప‌నిచేసే ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు కూడా సంతోషం వ్య‌క్తం చేశారు. ఏపీకి చెందిన భ‌వ‌నాలే అయినా.. తెలంగాణ‌లో ఉత్తినే ఉంటున్నాయి. పైగా వాటి మెయింటెనెన్స్ కింద రూ.8 కోట్లు చెల్లించాల్సి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో వాటిని వ‌దిలించుకోవ‌డ‌మే మంచిద‌ని వారు చెబుతున్నారు.

అదేస‌మ‌యంలో జ‌గ‌న్ త‌న‌కు అవ‌స‌రం లేనివాటిని వ్యూహాత్మ‌కంగా వ‌దిలించుకోవ‌డం ద్వారా తెలంగాణలో త‌న‌కు యాక్సిస్‌ను మ‌రింత పెంచుకున్నార‌ని అంటున్నారు. అంటే, రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన వాటిని ఇలానే స‌మ‌తౌల్యం చేసుకుని రాబ‌ట్టుకునేందుకు మార్గం సుగ‌మ‌మైంద‌ని అంటున్నారు. ఇక‌, కేంద్రంలోని మోడీ స‌ర్కారు విష‌యంలోనూ ఆచి తూచి అడుగులు వేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. కేంద్రంతో గొడవ‌లు లేకుండా సంయ‌మ‌నం పాటిస్తూ.. రావాల్సిన‌వి రాబట్టుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటున్నారు. అంటే.. అటు కేసీఆర్‌, ఇటు మోడీల మ‌ధ్య‌న స‌మ‌యానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఏపీకి న్యాయం చేసే దిశ‌గా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు చెబుతున్నారు. కాబ‌ట్టి.. ఓ వ‌ర్గపు పాల‌న‌కు జై కొట్టిన ఓ వ‌ర్గ‌పు మీడియా వేచి చూసే ధోర‌ణిలో ఉండ‌డం దీనిని ధ్రువ‌ప‌రుస్తోంది.

కేంద్రం,తెలంగాణ‌ న‌డుమ జ‌గ‌న్‌.. ఫ్యూచ‌ర్ ఏంటి…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts