ఎన్టీఆర్ విష‌యంలో జ‌గ‌న్ డెసిష‌న్ ఎలా ఉంటుందో…

June 11, 2019 at 5:04 pm

ఏపీలో వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చింది. న‌వ్యాంధ్ర రెండో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి తాను ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా నెర‌వేర్చుకుంటూ వ‌స్తున్నారు. జగన్ ఎన్నికల ప్రచారం లో చాలా హామీలు ఇచ్చారు. ఇప్పటికే ఆయన ఇచ్చిన హామీల్లో ఆశ వర్కర్లకు జీతాలు పెంచడం…. సామాజిక ఫించ‌న్లు పెంచడం ఎలా ఒక్కొక్క‌టి ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ అధికారంలోకి రాగానే ప్రతి నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణా జిల్లాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పెడతామని హామీ ఇచ్చారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్ప‌టి నుంచి జిల్లాల విభ‌జ‌న ప్ర‌క్రియ స్పీడ‌ప్ అయ్యింది. ప్ర‌స్తుతం ఉన్న 13 జిల్లాల‌ను 26 జిల్లాలుగా చేసే ప్ర‌క్రియ ప్రారంభించారు. ఇక విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం ఏజెన్సీలోని ప్రాంతాల‌తో పార్వతీపురం కేంద్రంగా మ‌రో జిల్లా కూడా ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే కృష్ణా జిల్లా కూడా విజ‌య‌వాడ కేంద్రంగా ఒక‌టి, మ‌చిలీప‌ట్నం కేంద్రంగా మ‌రో జిల్లాగా మార‌నుంది.

ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టిన స్వ‌గ్రామం మ‌చిలీప‌ట్నం జిల్లాలోకి వ‌స్తుంది. ఈ క్ర‌మంలోనే ఈ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాల్సి ఉంది. అస‌లు కృష్ణా జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టాల‌న్న డిమాండ్లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. ఇప్పుడు జిల్లాల విభ‌జ‌న అనివార్యం కావ‌డంతో మ‌చిలీప‌ట్నం కేంద్రంగా ఏర్ప‌డే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడ‌తారు. ఇక జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇచ్చిన హామీల‌తో టీడీపీకి కంచుకోట‌గా ఉన్న కృష్ణా జిల్లాలో ఆ పార్టీ కేవ‌లం రెండు సీట్ల‌తోనే స‌రిపెట్టుకుంది. జిల్లాలో టీడీపీ ఏకంగా 14 అసెంబ్లీ సీట్ల‌తో పాటు బంద‌రు ఎంపీ సీటు కూడా గెలుచుకుంది. ఇక ఇప్పుడు జ‌గ‌న్ ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు విష‌యంలో డెసిష‌న్ తీసుకోవ‌డం ఒక్క‌టే మిగిలి ఉంది.

ఎన్టీఆర్ విష‌యంలో జ‌గ‌న్ డెసిష‌న్ ఎలా ఉంటుందో…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts