ప‌వ‌న్‌కి భారీ షాక్‌.. జనసేనకు జేడీ గుడ్ బై !

June 16, 2019 at 3:00 pm

ఎన్నో ఆశ‌లు, మ‌రెన్నో ఆశ‌యాల‌తో రాజ‌కీయ అరంగేట్రం చేసిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటు ప్ర‌జ‌ల్లో త‌నపై న‌మ్మ‌కా న్ని పెంచుకోలేక పోయారు. త‌న‌కంటూ ప్ర‌త్యేక రాజ‌కీయాలు సృష్టించుకుని, ప్ర‌జ‌ల్లోకి వ‌స్తాన‌ని చెప్పిన ప‌వ‌న్‌.. ఆ దిశ‌గా ముందుకు వెళ్ల‌లేక పోయారు. ఆయ‌న తీసుకున్న‌యూట‌ర్న్‌లు, లోపాయికారీ రాజ‌కీయాలు, చంద్ర‌బాబుతో తెర‌చాటు చేసుకున్న ఒప్పందాలు వంటి వాటిని ప్ర‌జ‌లు గుర్తించారు. ఎవ‌రైనా రాజ‌కీయాల్లో ఉంటే.. అధికార పార్టీ చేసే ప‌నుల‌ను విమ‌ర్శిస్తారు. కానీ, ప‌వ‌న్ మాత్రం చంద్ర‌బాబు వ్యూహాల‌ను త‌న నోటి ద్వారా ప‌లికి.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యాఖ్య‌లు చేస్తూ. ప్ర‌తి ప‌క్షంపై దాడులు చేశారు.

ముఖ్యంగా జ‌గ‌న్‌ను ఓ నేర‌స్తుడిగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. అదేస‌మ‌యంలో తెలంగాణ‌లో ఏపీ వాళ్ల‌ను కొడుతు న్నార‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు ప్ర‌జ‌లు న‌వ్వుకున్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో అనేక ట్రోల్స్ కూడా వ‌చ్చాయి. ఇక‌, పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేసుకోవ‌డాన్ని ఆయ‌న విస్మ‌రించి, త‌నే కీల‌కంగా మారారు. ఫ‌లితంగా గ్రామ‌, మండ‌ల‌స్థాయిలో పార్టీ ప‌ట్టుకోల్పోయింది. వెర‌సి తాను చేసుకున్న త‌ప్పులు కార‌ణంగానే ఎద‌గాల్సిన నాయ‌కుడు ఎదుగుద‌ల లేకుండా పోయి.. రాజ‌కీయంగా త‌నకు తానే గొయ్యి తీసుకున్నార‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపించాయి.

ఈ క్ర‌మంలోనే తాను పోటీ చేసిన రెండు చోట్ల కూడా ప‌వ‌న్ ఓట‌మిపాల‌య్యారు. ఇదిలావుంటే, ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం నుంచి పాఠాలు నేర్చుకుని పార్టీని ముందుకు న‌డిపిస్తాన‌ని ప‌వ‌న్ చెబుతున్నారు. అయితే, ఆయ‌న సినిమా డైలాగుల‌కు ఎవ‌రూ ఫిదాకార‌ని, ఏపీ రాజ‌కీయాలు తెలుగు చ‌ల‌న చిత్ర వెండితెర కాద‌ని ప్ర‌జ‌లు అంటున్నారు. ఈ క్ర‌మంలో అటు ప్ర‌జ‌లు న‌మ్మ‌ని కార‌ణంగా ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయిన ప‌వ‌న్‌.. ఇప్పుడు పార్టీలోనూ త‌న న‌మ్మ‌కాన్ని నిలుపుకోలేక పోతున్నారు. కీల‌క నేత‌లు పార్టీకి దూరం కావాల‌ని నిర్ణ‌యించుకోవ‌డ‌మే దీనికి ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు.

విశాఖ ప‌ట్నం పార్ల‌మెంటు స్థానం నుంచి ఎన్నో ఆశ‌ల‌తో నిజాయితీనే కొల‌మానంగా భావించిన జ‌న‌సేన త‌ర‌పున పోటీ చేశారు సీబీఐ మాజీ జేడీ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ‌. ఈ క్ర‌మంలో ఆయ‌న వంద రూపాయ‌ల బాండు పేప‌ర్‌పై త‌న హామీల‌కు సంబంధించి ఓ హామీ ప‌త్రాన్ని కూడా ప్ర‌జ‌ల‌కు అందించారు. అయినా కూడా జ‌గ‌న్ సునామీ ముందు ఇలాంటివేవీ ప‌నిచేయ‌లేదు. దీంతో రెండు ల‌క్ష‌ల పైచిలుకు ఓట్లు సాధించినా.. ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న‌కు బీజేపీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. మా పార్టీలోకి రండి మీకు చ‌క్క‌ని భ‌విష్య‌త్తును అందిస్తామంటూ.. క‌మ‌ల నాథులు రెడ్ కార్పెట్ ప‌రిచారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కూడా ప‌వ‌న్‌ను న‌మ్ముకునే క‌న్నా బీజేపీతో చెలిమి చేస్తే.. బెట‌ర్ అనే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇదే జ‌రిగి.. బీజేపీ గూటికి వీవీ చేరిపోతే.. ప‌వ‌న్‌కు భారీ దెబ్బ త‌ప్ప‌ద‌ని అంటున్నారు.

ప‌వ‌న్‌కి భారీ షాక్‌.. జనసేనకు జేడీ గుడ్ బై !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts