చివ‌రికి మిగిలేదేంటి? జ‌న‌సేన అధినేత‌పై ఓ స్టోరీ

June 12, 2019 at 10:22 am

ప‌వ‌న్‌. జ‌న‌సేనాని. నూత‌న పంథాతో.. నూత‌న రాజ‌కీయ ఆశ‌ల‌తో ఏపీ, తెలంగాణ‌ల రాజ‌కీయ వేదిక‌ల‌పై వ‌చ్చిన న‌వ యువ నాయ‌కుడు. సిక్కోలు నుంచి అనంతపురం వ‌ర‌కు కూడా ఆయ‌నపై ప్ర‌జ‌లు, అభిమానులు.. ముఖ్యంగా కొణిద‌ల ఫ్యామిలీకి క‌ర‌డు గ‌ట్టిన వీరాభిమానులు ఆశ‌లు పెట్టుకున్నారు. అవినీతి లేని, అస‌మాన‌త‌లు లేని స‌మాజ స్థాప‌నే ధ్యేయ మంటూ.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్‌, సొంతంగా పార్టీ పెట్టుకుని దాదాపు 5 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. మ‌రి ఐదేళ్ల కాలంలో జ‌రిగిన రెండు కీల‌క ఎన్నిక‌ల్లో ఆయ‌న ఒక‌దానిలో పార్టిసిపేట్ కూడా చేశారు.

ఈ క్ర‌మంలో.. ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలో, రాజ‌కీయ వ్యూహ ప్ర‌తివ్యూహాల్లో ప‌వ‌న్ ఏమేర‌కు స‌క్సెస్ అయ్యారు. ఆయ‌న ఏమేర కు రాష్ట్ర ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చోటు సంపాయించుకున్నారు? అనే అంశాలు ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. సినిమా రంగం నుంచి వ‌చ్చిన వారు రాజ‌కీయాల్లో స‌క్సెస్ కావ‌డం తెలిసిందే. ఏపీలో అన్న‌గారు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 మాసాల్లోనే అధికా రంలోకి వ‌చ్చారు. అయితే, ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన మెగాస్టార్‌మాత్రం అధికారంలోకి రాక‌పోగా.. కేవ‌లం 18 సీట్ల తోనే స‌రిపెట్టుకుని, చివ‌రికి పార్టీని విలీనం చేశారు.

ఇక‌, ఇప్పుడు ప‌వ‌న్ వంతు వ‌చ్చింది. 2014లో ఎన్నిక‌ల‌కు ముందుగానే పార్టీ పెట్టినా ఆయ‌న పోటీకి దూరంగా ఉన్నారు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. ఏకంతా తానే స్వ‌యంగా రెండు స్థానాల్లోపోటీ చేశారు. అయినా కూడా ఓట‌మి పాల‌య్యారు. కేవ‌లం ఒక్క‌చోట మాత్ర‌మే విజ‌యం సాధించారు. దీంతో ఐదేళ్ల‌పాటు పార్టీని నెట్టుకు రావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇంత‌లోనే గోరు చుట్టుపై రోక‌లి పోటు మాదిరిగా గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నుంచి పోటీ చేసిన రావెల కిశోర్ బాబు ప‌వ‌న్‌కు హ్యాండిచ్చారు. పార్టీకి బై చెప్పి నేరుగా వెళ్లి బీజేపీలో చేరిపోయారు. మ‌రికొద్ది రోజుల్లోనే మ‌రింత మంది నాయ‌కులు వ‌ల‌స బాట ప‌డ‌తార‌ని అంటున్నారు.

ఇక‌, ఈ నేప‌థ్యంలో అస‌లు మ‌రో ఐదేళ్ల‌పాటు జ‌న‌సేన ఉంటుందా? అనే చ‌ర్చ మొద‌లైంది. ఐదేళ్ల‌పాటు పార్టీని బ‌లోపేతం చేయ‌డంతోపాటు వ్యూహాత్మ‌కంగా ఎద‌గాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే, ఈ ఐదేళ్లు ఆర్థిక స‌మ‌స్య‌లు కూడా ప‌వ‌న్‌ను వెంటాడే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. దీంతో ఆయ‌న మూవీల‌పై దృష్టిపెడితే.. పార్టీ మ‌రింత దెబ్బ‌తినే ఛాన్స్ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ త‌న వ్య‌వ‌హార శైలిని కూడా మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఆయ‌న ప్ర‌సంగాల్లో ఎక్కువ‌గా సినిమా డైలాగులు వ‌ల్లించ‌డాన్ని త‌గ్గించుకుని వాస్త‌వ దృక్ఫ‌థాన్ని అల‌వ‌రుచుకుంటేనే సామాన్య ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతార‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

చివ‌రికి మిగిలేదేంటి? జ‌న‌సేన అధినేత‌పై ఓ స్టోరీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts