కేజీఎఫ్ డైరెక్ట‌ర్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌…!

June 5, 2019 at 3:04 pm

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్వ‌ర‌లో తెర‌పై ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నాడా… రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పి మ‌ళ్ళీ రంగుల ప్ర‌పంచంలో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారా… ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం బ‌డా నిర్మాణ సంస్థ‌లు క్యూ క‌డుతున్నారు… కానీ ప‌వ‌న్ మ‌న‌స్సులో ఏముందో ఇప్ప‌టి వ‌ర‌కు అంతుచిక్క‌డం లేదు.. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా చేస్తున్నాడ‌నే రూమ‌ర్లు మాత్రం ఆగ‌డం లేదు.. ఇప్పుడు కేజీఎఫ్ డైరెక్ట‌ర్‌తో సినిమా అనే ప్ర‌చారం సాగుతోంది…

ప్ర‌స్తుతం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల‌పైనే దృష్టి నిలిపారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన మొన్న‌టి ఎన్నిక‌ల్లో దారుణ‌మైన ఫ‌లితాల‌ను చ‌విచూసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ప‌రాజ‌యం పాల‌య్యాడు. ఈ షాకు నుంచి ఇంకా ప‌వ‌న్ తేరుకోలేద‌నే తెలుస్తుంది. జ‌న‌సేన పార్టీని ఉంచాలా.. లేక జెండా పీకేయ్యాలా అనే ధీర్ఘాలోచ‌న‌లో ప‌వ‌న్ ఉండ‌గానే ఆయ‌న సినిమాల్లో న‌టిస్తాడ‌నే ప్ర‌చారం బాగా సాగుతోంది…

కొంత‌కాలంగా బండ్ల గ‌ణేష్ బ్యాన‌ర్‌లో సినిమా వ‌స్తుంద‌ని పుకార్లు షికారు చేశాయి. దానిపై ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. ఇక ఇప్పుడు కేజీఎఫ్ సినిమా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించ‌బోతున్నాడ‌నే వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్లో ఈ సినిమా ఉండ‌బోతోంద‌ట‌. ప‌వ‌న్ మైత్రీ మూవీ మేక‌ర్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది. అది ఇప్పుడు ప‌ట్టాలేక్క‌నున్న‌ద‌నేది టాక్‌. ఏదేమైనా త్వ‌ర‌లో పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

కేజీఎఫ్ డైరెక్ట‌ర్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts