పవన్ పుత్రా… రావ‌య్యా…!

June 29, 2019 at 1:35 pm

మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌తో ఆయ‌న కుటుంబం నుంచి ఎవ‌రు సిని రంగ ప్ర‌వేశం చేసినా అభిమానులు ఆద‌రించారు. చిరంజీవి త‌మ్ముడైనా, కొడుకైనా, అల్లుడైనా చివ‌రాఖ‌రికి కుటుంబంతో సంబంధం ఉన్న ఎవ్వ‌రినైనా అభిమానులు అక్కున చేర్చుకున్నారు. ఉన్న‌త శిఖ‌రాల‌కు చేర్చారు… మెగాస్టార్ ఇమేజ్‌తో సిని రంగ ప్ర‌వేశం చేసి టాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్‌ను సృష్టించుకోవ‌డ‌మే కాదు… ఏకంగా ట్రెండ్ సెట్ చేసిన హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ఇప్పుడు అదే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొడుకు ఆకిరా కోసం టాలీవుడ్‌లో పెద్ద‌లు, మెగా కుటుంబ అభిమానులు ఎదురుచూస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదేమో. ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రేణుదేశాయ్‌ల ముద్దుల త‌న‌యుడు ఆకిరా. త‌ల్లిదండ్రులు విడాకులు తీసుకుని ఎవ‌రికి వారేగా కాపురాలు ఉంటున్నా మాత్రం పిల్ల‌ల విష‌యంలో ఇటు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అటు రేణుదేశాయ్‌లు ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ తీసుకుంటారు. భార్యాభ‌ర్త‌లు విడివిడిగా ఉంటున్న‌ట్టే కాని వీరి మ‌న‌సంతా కొడుకు, కూతురుపైనే అంటే ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మాన‌దు.

అయితే ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రేణుదేశాయ్‌ల పుత్ర‌ర‌త్నం ఆకిరా కోసం టాలీవుడ్ ఎదురుచూస్తూంది. కాదు కాదు మెగా అభిమానులు ఆకిరా తెరంగ్రేటం ఎప్పుడెప్పుడా అని ఆరా తీస్తున్నారు. అయితే ఆకిరా ఇటీవల త‌న త‌ల్లి రేణుదేశాయ్‌తో మంచుకొండలు, సెల‌యేల్లు, కొండ‌లు, గుట్ట‌లు, లోయ‌లతో నిండిఉన్న కాశ్మీర్ ప‌ర్య‌ట‌న చేశారు. అక్క‌డ జ‌ల‌జ‌ల పారుతున్న సెల‌యేరుల వ‌ద్ద త‌ల్లీకొడుకులు దిగిన ఒక ఫోటోను సోష‌ల్ మీడియాలో రేణుదేశాయ్ పోస్టు చేసింది. ఈ పోస్టు ను చూసిన ప్ర‌తి ఒక్క‌రు ఆకిరా ఇక సినిమాల‌కు వచ్చేయ్‌… అంటూ కోరుతున్నారు. సో ఆకిరా సినిమాకు వేళాయేనా..? మ‌రి తండ్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్, త‌ల్లి రేణుదేశాయ్‌ల మ‌దిలో ఏముందో తెలియాల్సి ఉంది.

పవన్ పుత్రా… రావ‌య్యా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts