ప్రభాస్ “సాహో” క‌థ లీకైందోచ్‌…!

June 6, 2019 at 4:36 pm

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బ‌హూబ‌లి, బ‌హూబ‌లి 2 త‌ర్వాత వ‌స్తున్న చిత్రం సాహో. బ‌హూబ‌లి సినిమా వ‌చ్చి ఇప్ప‌టికే రెండేళ్ళు పూర్త‌యిపోయింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా ప్ర‌భాస్‌కు సంబంధించిన ఏ చిత్రం రాలేదు. ఇప్ప‌టి దాకా ప్ర‌భాస్ అభిమానులు సాహో సినిమా కోస‌మే ఎన్నో ఆశ‌ల‌తో ఎదురు చూస్తున్నారు. అభిమానుల నిరీక్ష‌ణ ఫ‌లించే రోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయి. హాలీవుడ్ త‌ర‌హాలో తెర‌కెక్కుతున్న ఈచిత్రం ఆగ‌స్టు 15న విడుద‌ల చేసేందుకు స‌న్న‌హాలు చేస్తున్నారు.

ఈ చిత్రం విడుద‌లకు స‌న్న‌హాలు జ‌రుగుతుండ‌గానే ఫ‌స్ట్‌లుక్‌, సెకండ్ లుక్‌, మేకింగ్ వీడియోల‌ను విడుద‌ల చేసింది చిత్రబృందం. ఇక ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో రూపొందిస్తున్న‌ప్ప‌టికి క‌థ ఏంటో, ఇందులో ప్ర‌భాస్ పాత్ర ఏంటిదో అభిమానుల‌కు గానీ, ఇటు సిని వ‌ర్గాల‌కు తెలియ‌దు. ఎంతో ప‌క్కాగా ప్లాన్ చేసి, చిత్రంకు సంబంధించిన విష‌యాలు బ‌య‌టికి పొక్క‌కుండా జాగ‌త్ర ప‌డుతున్నారు. కాని ఈ చిత్రం క‌థ ఏంటో, ప్ర‌భాస్ చేస్తున్న పాత్ర ఏంటో లీకైంది.

సాహో సినిమా ఓ రివేంజ్ డ్రామాగా రూపొందుతుంద‌ట‌. ఓ అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ ప్ర‌భాస్ కుటుంబ స‌భ్యుల‌ను, స్నేహితుల‌ను చంపుతాడ‌ట‌. దీనికి ప్ర‌తికారం తీర్చుకునేందుకు ప్ర‌భాస్ ఓ ఇంట‌ర్ పోల్ పోలీసాఫీస‌ర్‌గా అవ‌తార‌మెత్తి అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్‌ను తుద‌ముట్టిస్తాడ‌ట‌. న‌కిలి ఇంట‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా మారిన ప్ర‌భాస్ ఎలా అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్‌ను అంతం చేశాడు, ఎలా చేశాడు అనేదే ఈ సినిమా క‌థాంశం అట‌. ఏదేమైనా ఈ సినిమా ఎంతో ఆస‌క్తిక‌రంగా రూపొందుతుంద‌నుట‌లో సందేహం లేదు. సినిమా క‌థ‌, ప్ర‌భాస్ పాత్ర ఏంట‌నేది ఆగ‌స్టు 15న థియెట‌ర్ల‌లో తేల‌నుంది. అప్పటి దాకా వేచిచూడాల్సిందే మ‌రి.

ప్రభాస్ “సాహో” క‌థ లీకైందోచ్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts