స‌మంతాకు నో చెప్పిన రామ్‌చర‌ణ్‌..

June 6, 2019 at 1:27 pm

స‌మంత అక్కినేని తెలుగు ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని పేరు. ఏమాయ చేసిందో ఏమో గాని ఈ అమ్మ‌డు మ‌జిలి సినిమా వ‌ర‌కు వెనుదిరిగి చూసే ప‌రిస్థితి ఏనాడు తెచ్చుకోలేదు. ఎప్పుడు ఖాళీ అనేదే లేకుండా నిత్యం సినిమా షూటింగ్‌ల‌తో బిజిగా ఉండే ఈ సుంద‌రికి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఓ మెగా షాకు ఇచ్చాడు. అక్కినేని కుటుంబ కోడ‌లుగా, నాగ‌చైత‌న్య భార్య‌గా టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్‌గా ఉన్న స‌మంతను రామ్‌చ‌ర‌ణ్ అవ‌మాన ప‌రిచాడ‌ట‌.

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అలియాస్ జ‌క్క‌న్న నేతృత్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ఆర్ ఆర్ ఆర్‌లో న‌టిస్తున్నాడు. ఈసినిమా ఇప్పుడు సెట్స్‌పై ఉంది. షూటింగ్‌ను జ‌రుపుకుంటున్న ఈసినిమా వ‌చ్చే ఏడాది విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నాడు జ‌క్క‌న్న. అయితే జ‌క్క‌న్న సినిమా పూర్తి కాగానే రామ్‌చ‌ర‌ణ్ శ్రీ‌ను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు.

శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ కు జోడిగా స‌మంతను ఎంపిక చేయాల‌ని అనుకున్నార‌ట ద‌ర్శ‌కుడు. కాని పాపం స‌మంత‌కు రామ్‌చ‌ర‌ణ్ నో చెప్పాడ‌ట‌. ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు జై కొట్టిన రామ్ చ‌ర‌ణ్ స‌మంత‌ను వ‌ద్ద‌న్నాడ‌ట‌. దీంతో స‌మంత నొచ్చుకుంద‌ట‌.. అంటే ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈ మ‌ధ్య కాలంలో జీరో సైజ్‌లోకి రావ‌డంతో రామ్‌చ‌ర‌ణ్ ర‌కుల్‌కు కోరుకుంటున్నాడ‌ని తెలుసుకున్న స‌మంత చ‌ర‌ణ్‌పై చిర్రుబుర్రు లాడుతుంద‌ట‌. నేనేం త‌క్కువ తిన్నానా నేను కూడా ర‌కుల్ లాగా స‌న్న‌బ‌డుతాన‌ని ప్ర‌తిజ్ఞ చేసి జిమ్‌కు వెళుతూ 95కిలోల బ‌రువులెత్తుతుంద‌ట‌. ఫారీన్ ఫిట్‌నెస్ ట్రైన‌ర్ వ‌ద్ద జిమ్‌లో స్లిమ్‌గా అయ్యేందుకు స‌మంత క‌ష్ట‌ప‌డుతుంద‌ట పాపం. సో ర‌కుల్‌కు పోటీగా సమంత స‌న్న‌బ‌డే ప‌నిలో ప‌డిందన్న‌మాట‌.

స‌మంతాకు నో చెప్పిన రామ్‌చర‌ణ్‌..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts