ఆ హీరోతో రెజీనా ప్రేమాయ‌ణం.. ఎంగేజ్‌మెంట్‌…!

June 16, 2019 at 4:00 pm

బ‌క్క‌ప‌ల్చ‌ని భామ రెజీనా టాలీవుడ్‌లో ఓ మోస్త‌రు హీరోయిన్ స్థాయిని మించి ఎద‌గ‌లేక‌పోయింది. కెరీర్ స్టార్టింగ్ నుంచి మీడియం రేంజ్ హీరోలు, మీడియం రేంజ్ సినిమాలే చేసుకుంటూ వ‌చ్చిన ఆమె కెరీర్‌లో ఒక‌టీ అరా హిట్లు ప‌డ్డాయే త‌ప్పా కెరీర్ ప‌రంగా ఆమెకు పెద్ద‌గా గుర్తుండిపోయే సినిమాలు అయితే రాలేదు. ఇక ఇటీవ‌ల ఆమెకు అస్స‌లు హిట్లు లేవు.

కెరీర్ స్టార్టింగ్‌లో సాయిధ‌ర‌మ్ తేజ్‌తో రెజీనా ప్రేమ‌లో ఉంద‌ని… వాళ్లిద్ద‌రు పెళ్లి కూడా చేసుకోబోతున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. సాయితో వ‌రుస‌గా సినిమాలు చేయ‌డ‌మే ఈ పుకార్ల‌కు కార‌ణ‌మైంది. ఆ త‌ర్వాత వ‌రుస ప్లాపుల‌తో కెరీర్ ప‌రంగా రేసులో వెన‌క‌ప‌డిపోయింది. మ‌రీ బీ గ్రేడ్ సినిమాలు కూడా చేసింది. ప్ర‌స్తుతం ఒక్క హిట్ కోసం ఆమె ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఆమెను ఎవ్వ‌రూ ప‌ట్టించుకునే వారే లేరు.

ఇక లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం రెజీనా సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుంద‌ని.. త్వ‌ర‌లోనే ఆమె పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అవుతోంద‌ని వార్తలు వ‌స్తున్నాయి. రీసెంట్‌గా వ‌చ్చిన సెవెన్ సినిమాలో ఆమె కంప్లీట్ నెగిటివ్ రోల్ చేసింది. ఈ సినిమా ఎప్పుడు వ‌చ్చిందో ? ఎప్పుడు వెళ్లిందో ? తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 13 న ఈమె చాలా తక్కువ మంది సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు బ‌య‌ట‌కు వచ్చాయి.

రెజీనా కెరీర్ స్టార్టింగ్ నుంచి సందీప్‌కిష‌న్‌తో కూడా ఎక్కువ సినిమాలే చేసింది. ఇక సందీప్‌ను ఆమె డీప్‌గా ల‌వ్ చేసింద‌ని కూడా అంటున్నారు. ఇప్పుడు ఏకంగా ఎంగేజ్‌మెంట్ అయిపోయింద‌ని చెపుతున్నారు. ఇంత‌కు ఆమె ఎంగేజ్‌మెంట్ ఎవ‌రితో అయ్యింద‌న్న‌ది మాత్రం తెలియ‌డం లేదు. ఈ వార్త‌ల్లో నిజానిజాలు బ‌య‌ట‌కు రావాలంటే రెజీనాయే స్వ‌యంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ఆ హీరోతో రెజీనా ప్రేమాయ‌ణం.. ఎంగేజ్‌మెంట్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts