రోజా కోసం జ‌గ‌న్‌కు విజయశాంతి ట్విట్

June 11, 2019 at 1:59 pm

అందం, అభిన‌యంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మంత్ర‌ముగ్దుల‌ను చేసిన న‌టి రోజా. అదే విధంగా అందచందాల‌తో, న‌ట‌నా చాతుర్యంతో తెలుగు ప్రేక్ష‌క లోకాన్నే ఏలిన సుంద‌రి విజ‌య‌శాంతి. ఒక‌రు కేవ‌లం అంద‌చందాల‌నే అమ్ముకుని అగ్ర‌హీరోయిన్‌గా ఎదిగిన‌వారు. మ‌రొక‌రు అంద‌చందాల‌నే కాకుండా ఫైట్లు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో న‌టించి లేడి సూప‌ర్‌స్టార్‌గా, లేడి అమితాబ్‌గా పేరుతెచ్చెకున్నవారు. ఇలా ఒక‌రు రోజా, మ‌రొక‌రు విజ‌య‌శాంతి. ఇద్ద‌రి నేప‌ద్యం సినిమానే.

సినిమా నేప‌థ్యం నుంచి వ‌చ్చిన విజ‌య‌శాంతి, రోజాలు త‌రువాత కాలంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. విజ‌య‌శాంతి తెలంగాణ రాష్ట్రం కోసం ప్ర‌త్యేక తెలంగాణ నినాధంను ఎజెండాగా పెట్టుకుని త‌ల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. కొంత‌కాలం త‌రువాత పార్టీని తెలంగాణ రాష్ట్ర స‌మితిలో విలీనం చేశారు. త‌రువాత కాలంలో ఆమే మెద‌క్ ఎంపిగా గెలిచారు. కొంత‌కాలం బీజేపీలో ప‌నిచేసిన విజ‌య‌శాంతి త‌రువాత కాలంలో కాంగ్రెస్‌లో చేరి రాష్ట్ర ముఖ్య‌నేత‌ల్లో ఒక‌రిగా నిలిచింది.

ఇక ఆర్ కె రోజా సినిమాల‌కు గుడ్‌బై చెప్పి రాజ‌కీయాల్లో చేరారు. టీడీపీలో చేరిన రోజా త‌ద‌నంత‌రం ప‌రిణామాల నేప‌థ్యంలో వైఎస్సార్ పార్టీలో చేరారు. వైసీపీలో కీల‌క నేత‌గా మారిన రోజా ఫైర్‌బ్రాండ్ అనే ముద్ర వేసుకున్నారు. రోజా ఎమ్మెల్యేగా న‌గ‌రి నుంచి రెండోసారి గెలుపొందారు. ఐతే వైసీపి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి రావ‌డంతో రోజాకు జ‌గ‌న్ కేబినేట్ మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌నుకున్నారు. కాని రోజాకు మంత్రి ప‌ద‌వి రాలేదు. దీంతో రోజా కొంత కినుక వ‌హించారు.

ఇప్పుడు రోజాకు లేడి సూప‌ర్‌స్టార్ విజ‌య‌శాంతి నుంచి అనూహ్య మద్ద‌తు ల‌భించింది. రాజ‌కీయాల్లో సిని న‌టుల‌ను కేవ‌లం ప్ర‌చారం కోసం వాడుకోవ‌ద్ద‌ని ఏపీ సిఎం జ‌గ‌న్‌కు ట్విట్ట‌ర్ ద్వారా స‌ల‌హా ఇచ్చింది విజ‌య‌శాంతి. అదే ట్విట్ట‌ర్‌లో రోజాకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని సూచ‌న చేసింది. సినిమా రంగంకు చెందిన రోజాకు మంత్రి ప‌ద‌వి ఇస్తే బాగుండేద‌ని ట్విట్ట‌ర్‌లో అభిప్రాయ‌ప‌డింది. ఇక‌నైనా రోజాకు న్యాయం చేయాల‌ని విజ‌య‌శాంతి చేసిన స‌ల‌హా తో రోజాకు విజ‌య‌శాంతి మ‌ద్ద‌తు ల‌భించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రి విజ‌య‌శాంతి చేసిన సూచ‌న రోజాకు ఏమేర‌కు లాభిస్తుందో వేచిచూడాల్సిందే.

రోజా కోసం జ‌గ‌న్‌కు విజయశాంతి ట్విట్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts