ఆర్ఆర్ఆర్ ఫ‌స్ట్‌లుక్‌కు ముహూర్తం ఫిక్స్‌…!

June 15, 2019 at 3:36 pm

ఆర్ ఆర్ ఆర్‌… రాజ‌మౌళి, రామ్‌చ‌ర‌ణ్‌, రామ్‌ల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా. ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై సిని ప‌రిశ్ర‌మ‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి బాహూబ‌లి సినిమా నిర్మాణం త‌రువాత మ‌రే చిత్రంను రూపొందించ‌లేదు. ఆయ‌న రూపొందించిన బాహూబ‌లి 2 త‌రువాత ఆయ‌న సినిమాలు లేక‌పోవ‌డంతో ఆయ‌న అభిమానులు తీవ్ర నిరాశ‌లో ఉన్నారు. అయితే రాజ‌మౌళి భారీ బ‌డ్జెట్‌తో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌, యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ కాంబీనేష‌న్‌లో ఆర్ ఆర్ ఆర్ అనే వ‌ర్కింగ్ నేమ్‌తో సినిమాను రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించిన విశేషాల గురించి ఏ చిన్న వార్త బ‌య‌టికి పొక్కినా అది ట్రెండింగ్ అయిపోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన విశేషాల‌ను రాజ‌మౌళి బ‌య‌ట‌కు పొక్క‌కుండా చాలా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. త‌ను కూడా ఎలాంటి చిత్రానికి సంబంధించిన విష‌యాల‌ను లీకేజీ కాకుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. అయితే ఇప్ప‌డు ఆ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసేందుకు మూహూర్తం ఖరారు చేసిన‌ట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఆర్ ఆర్ ఆర్ సినిమాను జూలై 30, 2020న విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ముందుగానే ప్ర‌క‌టించాడు. దీంతో చిత్ర షూటింగ్‌ను సాధ్య‌మైనంత మేర‌కు శ‌ర‌వేగంగా జ‌రుపుతున్నారు. ప్ర‌స్తుతం చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో నిర్వ‌హిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను ఆగ‌స్టు 15న విడుద‌ల చేసేందుకు మూహూర్తం నిర్ణ‌యించిన‌ట్లు పుకార్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అదే రోజున యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ న‌టించిన సాహో సినిమా విడుద‌ల అవుతుంది. అదే రోజున ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేయాల‌ని సూత్ర‌ప్రాయంగా నిర్ణ‌యించుకున్న‌ట్లు వినికిడి. అదే నిజ‌మైతే ఆగ‌స్టు జెండా పండుగ‌కు తోడు అటు ప్ర‌భాస్ అభిమానుల‌కు, ఇటు తార‌క్‌, రామ్‌చ‌ర‌ణ్ అభిమానుల‌కు పండుగే పండుగ‌.

ఆర్ఆర్ఆర్ ఫ‌స్ట్‌లుక్‌కు ముహూర్తం ఫిక్స్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts