“ఐసియూ”లో టాలీవుడ్ యంగ్ హీరో

June 18, 2019 at 11:25 am

యంగ్ హీరో శ‌ర్వానంద్ భుజానికి శ‌స్త్ర‌చికిత్స విజ‌య‌వంతంగా ముగిసింది. 96 త‌మిళ మూవీ రీమేక్ సినిమాలో యంగ్‌హీరో శ‌ర్వానంద్ న‌టిస్తుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తు కింద ప‌డ‌టంతో భుజానికి గాయ‌మైన విష‌యం విధిత‌మే. న‌టుడు శ‌ర్వానంద్ భుజానికి వైధ్యులు 11గంట‌ల పాటు శ్రమించి విజ‌య‌వంతంగా శ‌స్త్ర చికిత్స చేసారు.

96 త‌మిళ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ద‌ర్శ‌కుడు సి.ప్రేమ్‌కుమార్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శ‌ర్వానంద్‌కు జంట‌గా స‌మంత న‌టిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం థాయ్‌లాండ్‌లో జ‌రుగుతుంది. షూటింగ్‌లో భాగంగా హీరో శ‌ర్వానంద్ స్కై డైవింగ్ చేస్తున్నాడు. స‌రైన రీతిలో లాండింగ్ కాక‌పోవ‌డంతో ప్ర‌మాదం త‌లెత్తింది. దీంతో శ‌ర్వానంద్ ప్ర‌మాదం భారీన ప‌డ్డాడు. ఈ ప్ర‌మాదంలో శ‌ర్వానంద్ భుజానికి గాయ‌మైంది.

థాయ్‌లాండ్‌లో గాయ‌ప‌డిన శ‌ర్వానంద్‌ను చికిత్స కోసం హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. హైద‌రాబాద్‌లోని ఓప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స నిర్వ‌హించారు. డాక్ట‌ర్లు సుమారు 11గంట‌లు శ్ర‌మించి విజ‌య‌వంతంగా ఆప‌రేష‌న్ చేశారు. ఈ ఆప‌రేష‌న్ చేసిన అనంత‌రం శ‌ర్వానంద్ సుమారు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని డాక్ట‌ర్లు సూచించారు. దీంతో ఇప్పుడు రెండు సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయి. 96 సినిమాతో పాటు, సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ర‌ణ‌రంగం చిత్రంలోనూ న‌టిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు మ‌రో నెల రోజుల పాటు షూటింగ్‌లు నిలిచిపోయాయి.

“ఐసియూ”లో టాలీవుడ్ యంగ్ హీరో
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts