సింగ‌ర్ సునితకు పవన్ స్టార్ ఛాన్స్ !

June 12, 2019 at 11:24 am

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి న‌టించే ఛాన్స్ కోసం ఎంద‌రో న‌టీన‌టులు ఆశ‌గా ఎదురుచూస్తుంటారు. అలాంటి ప‌వ‌న్ క‌ళ్యాణే స్వ‌యంగా త‌న సినిమాలో ఓ సింగ‌ర్‌ను తీసుకుంటున్న‌ట్లు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే.. ఎగిరి గంతేయ‌డం ఆ సింగ‌ర్ వంతు అయింది. ఓస్ అంతేనా ప‌వ‌న్‌తో సినిమా అంటే మాట‌లా… అయితే అభిమానులు ఆవేశ‌ప‌డిపోకండి సింగ‌ర్ సునిత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ ప‌క్క‌న హీరోయిన్‌గా కాదండీ సుమా… ప‌వ‌న్‌కు పిన్నిగా న‌టించేందుకు అవ‌కాశం వ‌చ్చింది అంతే…

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఓ క‌థ‌ను రెడి చేసి పెట్టాడ‌ట‌. ఈ సినిమా త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నున్న‌ట్లు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో టాక్ వినిపిస్తుంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ రాజ‌కీయాల్లో బిజిగా ఉన్నాడు. ఇంకొద్ది రోజుల్లో వ‌ప‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌కు తాత్కాలిక విర‌మ‌ణ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ట‌. ప‌వ‌న్‌కు మంచి స్నేహితుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌. ఆయ‌న‌తో సినిమా అంటే అభిమానుల్లో ఎక్క‌డ‌లేని అంచ‌నాలు ఉంటాయి. మాట‌ల మాంత్రికుడిగా చిత్రసీమ‌లో పేరున్న త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ప‌వ‌న్ కోసం ఓ క‌థ‌ను ఎప్పుడో రెడి చేసి పెట్టాడ‌ట‌.

సింగ‌ర్ సునిత ఎంతో కాలంగా త‌న గాత్రంతో తెలుగు శ్రోత‌ల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేస్తుంది. సింగ‌ర్ సునిత పాడిన పాట‌లు మ‌ళ్ళీ మ‌ళ్ళీ వినాల‌నింపించే తీరులో ఉంటాయి. తెర‌వెనుక త‌న గాత్రంతో మంత్ర‌ముగ్థుల‌ను చేసే సునిత తెర‌మీద క‌నిపించాల‌నే కోరిక‌ను ఎన్నోసార్లు బ‌య‌ట‌పెట్టింది. కాని అవ‌కాశాలు రాలేదు. ఇన్నాళ్ళ‌కు ఆమే కోరిక‌ను ఇటు ప‌వ‌న్ క‌ళ్యాణ్, అటు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తీర్చ‌బోతున్నారు. సింగ‌ర్ సునిత ప‌వ‌న్ కు పిన్నిగా న‌టించి త‌న కోరిక‌ను తీర్చుకోనున్న‌ది. గాత్రంతో విజ‌య‌వంతం అయిన సునిత నట‌న‌లో ఎలా రాణిస్తుందో వేచిచూడాల్సిందే.

సింగ‌ర్ సునితకు పవన్ స్టార్ ఛాన్స్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts