బాహూబలి రికార్డును బ్రేక్ చేసిన రాజ‌మౌళి

June 15, 2019 at 12:48 pm

రాజ‌మౌళి అంటే ఇప్పుడు చిత్ర‌సీమ‌లో తెలియ‌ని వారుండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. అలాంటి ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తాను సృష్టించిన రికార్డును తానే తిర‌గ‌రాసుకుంటే ఎలా ఉంట‌ది.. అంటే అది రికార్డుల‌కే రికార్డు అన్న‌మాట‌. తెలుగు చిత్ర‌సీమ నుంచి హాలీవుడ్ దాకా అంద‌రు ముక్కున వేలేసుకునేలా చేసిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. ఇప్పుడు అదే రాజ‌మౌళి మ‌రో రికార్డును క్రియోట్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడా అంటే అవున‌నే అంటున్నారు సిని పండితులు.

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం బాహుబ‌లి. ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ అయి ప్ర‌పంచవ్యాప్తంగా విమర్శ‌కుల ప్ర‌సంశ‌లు అందుకుంది. తెలుగు చిత్ర‌సీమ కీర్తిని న‌లుదిశ‌లా చాటిన రాజ‌మౌలి బాహూబ‌లి సినిమాతో రికార్డులు సృష్టించారు. ఈ రికార్డుల‌ను అందుకోవాల‌ని ఎంద‌రో ద‌ర్శ‌కులు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. టాలీవుడ్‌లో నాన్ బాహుబ‌లి రికార్డుల‌నే చెప్పుకుంటున్నారు కాని ఇప్పుడు అదే బాహుబ‌లి రికార్డును రాజ‌మౌళి రూపొందిస్తున్న చిత్రం బ్రేక్ చేసింది.

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్‌. ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణంలోనే ఉంది. ఇందులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌, యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌లు న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఓవ‌ర్సీస్ హ‌క్కుల‌ను అమ్మేశారు చిత్ర నిర్మాణ సంస్థ‌. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా ఓవ‌ర్సీస్ హ‌క్కుల‌ను దుబాయ్‌కి చెందిన ఫ‌ర్స్ ఫిలిమ్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ రూ.72కోట్ల‌కు కొనుగోలు చేసింద‌ట‌. అంటే బాహుబ‌లి ఓవ‌ర్సీస్ రేటు రూ.70కోట్లే. అంటే బాహుబ‌లి క‌న్నా రూ.2కోట్లు అధ‌నంగా ఆర్ ఆర్ ఆర్ చిత్రం వ‌సూలు చేసి రికార్డును నెల‌కొల్పింది. అంటే రాజ‌మౌళి రూపొందించిన బాహుబ‌లి రికార్డును రాజ‌మౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం బ్రేక్ చేయ‌డం అంటే త‌న రికార్డును తానే చెరిపేసుకున్న‌ట్లు లెక్క‌. సో రికార్డులు సృష్టించ‌డం ఒక్క రాజ‌మౌళికే సొంతం అన్న మాట‌.

బాహూబలి రికార్డును బ్రేక్ చేసిన రాజ‌మౌళి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts