బాల‌య్య ప్లాప్ డైరెక్ట‌ర్‌తో వెంకీ ..!

June 15, 2019 at 2:39 pm

ఈ సంక్రాంతికి ఎఫ్ 2 సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్టర్ హిట్‌ సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి బాబీ దర్శకత్వంలో వెంకీ మామ షూటింగ్లో పాల్గొంటున్నాడు. నిజజీవితంలో మేనమామా మేనల్లుళ్ళుగా ఉన్న వెంకీ, నాగ‌చైతన్య సేమ్ అదే రోల్స్‌లో ఇప్పుడు వెంకీమామ‌లో నటిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్ త‌న అన్న సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో నిర్మించే సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ దే దే ప్యార్ దే ‘ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను సురేష్ బాబు ఇప్పటికే ధ్రువీకరించారు.

ఈ సినిమా చేయడం వరకు బాగానే ఉన్నా… డైరెక్ట‌ర్ విషయంలో వెంకీ & సురేష్‌బాబు తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు అందరికీ షాక్‌ ఇస్తోంది. బాలయ్య హీరోగా 2016లో వచ్చిన డిక్టేట‌ర్ లాంటి సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీవాస్‌కు దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. డిక్టేట‌ర్ త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న శ్రీవాస్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన సాక్ష్యం సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు.

ఇంకా చెప్పాలంటే శ్రీవాస్ కెరీర్‌లో ల‌క్ష్యం లాంటి ఒక‌టి రెండు సినిమాలు మిన‌హా పెద్ద‌గా ఆడ‌లేదు. ఇప్పుడు వెంకీ ఛాన్స్ ఇవ్వ‌డం… అందులోనూ సురేష్‌బాబు ఓకే చెప్ప‌డం అంటే మామూలు విష‌యం కాదు. అజయ్ దేవగణ్ హీరో గా టబు, రకుల్ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్లుగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన “దే దే ప్యార్ దే” హిందీలో మంచి వసూళ్లను రాబట్టింది.

బాల‌య్య ప్లాప్ డైరెక్ట‌ర్‌తో వెంకీ ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts