డౌన్‌టు ఎర్త్‌.. ఫ‌స్ట్ డేనే నిరూపించిన జ‌గ‌న్‌

June 8, 2019 at 3:50 pm

డౌన్‌టు ఎర్త్‌.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండ‌డం! ఇది అంద‌రికీ సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. ముఖ్యంగా రాజ‌కీయంగా అనుభ‌వం ఉంద‌ని చెప్పుకొనే నాయ‌కులు కూడా అనేక మార్లు బోల్తా ప‌డిన సంద‌ర్భాలు ఉన్నాయి. కానీ, తాజాగా ఏపీ సీఎంగా బాధ్య త‌లు చేప‌ట్టిన వైసీపీ అధినేత, యువ‌నేత వైఎస్ జ‌గ‌న్ మాత్రం త‌నేంటో నిరూపించారు. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండ‌డం అనే కాన్సెప్టును పూర్తిగా నిరూపించారు. రాష్ట్రంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ప్ర‌భంజనం సృష్టిం చింది వైసీపీ. 175 స్థానాల‌కు గాను 151 స్థానాల్లో విజ‌యం సాధించి రికార్డులు సృష్టించింది. అదేస‌మ‌యంలో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా, సాధ్య‌మ‌వుతుందా? అనుకునే రేంజ్‌లో 25 ఎంపీ స్తానాల‌కు గాను 22 చోట్ల విజ‌యం సాధించింది.

ఈ అపూర్వ విజ‌యంతో వైసీపీకి ఒకింత ఆనందం, మ‌రోప‌క్క‌, ఒకింత గ‌ర్వం కూడా వ‌స్తాయ‌ని అంద‌రూ ఊహించారు. జ‌గ న్‌ను ఇక ఎవ‌రూ ప్రశ్నించ‌లేర‌ని, ఎవ‌రూ ఆయ‌న‌ను ప‌ట్టుకోలేర‌ని కూడా పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. భారీ మెజారిటీ కార‌ణంగా జ‌గ‌న్‌కి ఎవ‌రూ అడ్డు చెప్ప‌లేర‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా జ‌గ‌న్‌లో ఇలాంటి భావాలు కానీ, నేనే మోనార్క్‌, నావ‌ల్లే పార్టీ గెలిచింది. నా వ‌ల్లే ఇంత‌మంది ఎమ్మెల్యేలు విజ‌యం సాధించారు.. అనే ధోర‌ణికి క‌డు దూ రంలో ఉన్నారు. అంద‌రూ ప‌రిశ్ర‌మిస్తేనే ఈ విజ‌యం సాధ్య‌మైంద‌ని విన‌యంగా చెప్పుకొన్న జ‌గ‌న్‌.. నేటి త‌రం రాజ‌కీయ నేత‌ల‌కు చాలా ఆద‌ర్శం. నిజానికి నేడు అంతా నాదే, అంతా నేనే, నేను లేక పోతే.. మీరు లేరు.. అనే వ్యాఖ్య‌లు త‌ర‌చుగా నాయ‌కుల నుంచి వినిపిస్తున్నాయి.

కానీ, వీటికి విరుద్ధంగా జ‌గ‌న్‌.. ఈ ప్ర‌భుత్వం అంద‌రిదీ.. అంటూ త‌న తొలి ఉప‌న్యాసంలోనే ప్ర‌జ‌ల మ‌న‌సుతో పాటు పార్టీ నేత‌ల మ‌న‌సులు కూడా గెలుచుకున్నాడు. సీఎంగా త‌న ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మాన్ని ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా, సాదాసీదాగా విజ‌య‌వాడ‌లోని మునిసిప‌ల్ గ్రౌండ్‌లో నిర్వ‌హించి.. త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. త‌న ప్ర‌మాణ స్వీకార ఖ‌ర్చును తానే త‌గ్గుకున్న ఏకైక సీఎంగా ఆయ‌న రికార్డు సృస్టించారు. ఇక‌, రాష్ట్రంలో ప్ర‌తి ప‌నివిష‌యంలోనూ తాను పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేస్తాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ్యూడీషియ‌ల్ క‌మిష‌న్ ను తెర‌మీదికి తీసుకువ‌చ్చారు. ఇది స‌క్సెస్ అయితే,అతి త‌క్కువ‌కే ప‌నులుచేయ‌డంతోపాటు రాష్ట్ర ఖ‌జానాను కాపాడుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. మొత్తానికి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల‌నే ల‌క్ష‌ణాల‌నుపుణికి పుచ్చుకుని ఆచ‌ర‌ణ‌లో పెట్టిన జ‌గ‌న్‌.. రాష్ట్రాన్ని స‌మున్న‌త మార్గంలో న‌డిపిస్తాడ‌నడంలో సందేహం లేదు.

డౌన్‌టు ఎర్త్‌.. ఫ‌స్ట్ డేనే నిరూపించిన జ‌గ‌న్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts