జ‌గ‌న్ న‌యా డెసిషన్.. టీడీపీ నేత‌ల్లో వ‌ణుకు..

June 18, 2019 at 12:09 pm

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ న‌యా నిర్ణ‌యంతో టీడీపీ నేత‌లు వ‌ణికిపోతున్నారు. పాల‌నా ప‌రంగా ప‌క‌డ్బందీగా నిర్ణ‌యాలు తీసుకుంటూనే.. గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల ముందు ఉంచేందుకు జ‌గ‌న్ ప‌క్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే.. అన్నిశాఖ‌ల అధికారుల‌తో ఆయ‌న‌ స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. అన్నిశాఖ‌ల ప‌నితీరుపై ఇప్ప‌టికే ఓ అంచ‌నాకు వ‌చ్చారు. ఈ మేర‌కు అధికారులు కూడా చంద్ర‌బాబు పాల‌న‌లో ఏశాఖ‌లో ఎంత.. ఏస్థాయిలో అవినీతి జ‌రిగిందో వివ‌రిస్తూ.. సీఎం జ‌గ‌న్‌కు రిపోర్ట్ కూడా ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌రిణామాల‌తో టీడీపీ నేత‌లు వ‌ణికిపోతున్నారు.

ప్ర‌ధానంగా.. నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం, జాతీయ ప్రాజెక్టు పోల‌వ‌రం నిర్మాణంలో భారీగా అవినీతి జ‌రింద‌నే అంచ‌నాకు సీఎం జ‌గ‌న్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ధానంగా జ‌గ‌న్ పోల‌వ‌రం ప్రాజెక్టుపైనే దృష్టిసారిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈనెల 20న ఆయ‌న ప్రాజెక్టును క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించ‌నున్నారు. అధికారులు స‌మావేశంలో చెప్పిన విష‌యాల‌ను.. క్షేత్ర‌స్థాయిలో ప్రాజెక్టు తీరును పోల్చి స‌మ‌గ్ర నివేదిన త‌యారు చేయాల‌న్న ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అంటే.. పోల‌వ‌రం ప్రాజెక్టులో జ‌రిగిన అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు చేసి.. కేంద్రానికి నిర్మాణ బాధ్య‌త‌లు అప్ప‌గించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఐదేళ్ల టీడీపీ పాల‌న‌లో చంద్ర‌బాబు పోల‌వ‌రం క‌ట్ట‌డానికి కంటే అక్క‌డ చేసిన అవినీతే ఎక్కువుగా ఉంద‌న్న దానిపైనే పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. చివ‌ర‌కు మోడీ లాంటి వాళ్లు కూడా పోల‌వ‌రం అంటే చంద్ర‌బాబుకు ఏటీఎం లాంటిద‌ని విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి పోల‌వ‌రంపై కేంద్రం మ‌రీ క‌క్ష క‌ట్ట‌లేదు. అయితే తాము ఇచ్చిన ప్ర‌తి రూపాయికి లెక్క చెప్పాల‌న్న‌దే కేంద్రం డిమాండ్‌. అందుకు బాబు ఒప్పుకోక‌పోవ‌డంతోనే చివ‌ర‌కు ఈ స‌మ‌స్య వ‌చ్చింది.

ఇక అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పోల‌వ‌రం ప్రాజెక్టుపై జ‌గ‌న్ ప్ర‌త్యేక దృష్టి సారించ‌డంతో చంద్ర‌బాబుతోపాటు ఆయ‌న టీమ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రాజెక్టు కోసం కేంద్రం భారీగానే నిధులు కేటాయించింది. కానీ.. చంద్ర‌బాబు కేంద్రానికి త‌ప్పుడు బిల్లులు చూపించి.. భారీగా డ‌బ్బులు దండుకున్న‌ట్లు మీడియాలో క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. ఇప్పుడు జ‌గ‌న్ వాట‌న్నింటినీ బ‌య‌ట‌కు తీసి.. ప్ర‌జ‌ల ముందుంచే ప‌నిలో ఉన్నారు. మ‌రోవైపు.. అమ‌రావ‌తి నిర్మాణంలోనూ భారీగానే అవినీతి జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. పోల‌వ‌రం త‌ర్వాత జ‌గ‌న్ అమ‌రావ‌తిపైనే దృష్టి సారించే అవ‌కాశాలు ఉన్నాయి.

జ‌గ‌న్ న‌యా డెసిషన్.. టీడీపీ నేత‌ల్లో వ‌ణుకు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts