ఆరోగ్య శ్రీ ఆవిష్క‌ర్త‌కు అస‌లైన నివాళి.. గ్రేట్ జ‌గ‌న్‌!

June 4, 2019 at 12:50 pm

రాష్ట్రంలో రోగుల‌కు సంజీవ‌నిగా మారిన ఆరోగ్య ప‌థ‌కం ఏదైనా ఉందంటే.. అది ఒక్క ఆరోగ్య శ్రీ మాత్రమే! 2004లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో రాష్ట్రంలో ప్ర‌వేశ పెట్టిన ప్ర‌త్యేక‌మైన కీల‌క‌మైన ప‌థ‌కం ఆరోగ్య శ్రీ. దీనికి ముందు వైఎస్ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌త్యేక ప‌రిస్థితిలో పాద‌యాత్ర చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అనేక గ్రామాల్లో ప‌ర్య‌టించారు. ఈ స‌మ‌యంలోనే పేద‌ల‌ను, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారిని క‌లిశారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ వైద్య శాల‌లు ఉన్నా కూడా త‌మ ప్రాణాల‌కు రక్ష‌ణ లేదంటూ.. పేద‌లు త‌మ గోడును వెళ్ల‌బోసుకున్నారు.

ముఖ్యంగా వైద్య శాల‌లు సుదూరంలో ఉండ‌డం, ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల నుంచి రోగులు ఆయా ఆస్ప‌త్రుల‌కు చేరేందుకు నానా ఇబ్బందులు ప‌డుతున్న నేప‌థ్యంలో వారి ప్రాణాలు గాలిలోనే క‌లిసి పోతున్న ప‌రిస్థితిని వారు వైఎస్‌కు ఏక‌రువు పెట్టారు. దీనిని గ‌మ‌నించిన వైఎస్ తాను అధికారంలోకి రాగానే ప్ర‌వేశ పెట్టిన అనేక ప‌థ‌కాల్లో ఆరోగ్య శ్రీ -108 ఒక‌టి. దీనిని క్షేత్ర‌స్థాయిలో పూర్తిగా అమ‌లు చేశారు. ఏ పేద వాడు అనారోగ్యంతో మంచం ప‌ట్టి చ‌నిపోరాద‌నే ఏకైక ల‌క్ష్యంతో దీనిని ప్ర‌వేశ‌పెట్టారు. అన‌తి కాలంలోనే రాష్ట్రంలోనే కాకుండా ప‌క్క రాష్ట్రాల్లోనూ ఈ ప‌థ‌కం ప్ర‌చారం పొందింది. యూపీ స‌హా అనేక ఉత్త‌రాది రాష్ట్రాలు కూడా దీనిని అడాప్ట్ చేసుకున్నాయి.

ఇక‌, 2009లో వైఎస్ తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు ఈ ప‌థ‌క‌మే దోహ‌ద ప‌డింద‌న‌డంలో సందేహం లేదు. నేడు వైఎస్ భౌతికంగా లేక పోయినా.. ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన ఈ ప‌థ‌కం మాత్రం ప్ర‌జ‌ల మ‌న‌సుల నుంచి చెరిగిపోలేదు. చెదిరిపోలేదు. ఇప్ప‌టికీ ఏ అనారోగ్యం వ‌చ్చినా.. ఎక్క‌డ ఎలాంటి యాక్సిడెంట్ అయినా “108కి ఫోన్ కొట్టండి“ అనే మాట వినిపిస్తూనే ఉంటుంది. ఇక‌, 2014లో అధికారంలోకివ‌చ్చిన చంద్ర‌బాబు ఈ ప‌థ‌కాన్నిఉదాశీనంగా చూశారు. దీంతో ప్ర‌జ‌ల‌కు ఈ ప‌థ‌కం దాదాపు దూర‌మైంది. అయితే, తాజాగా రాజ‌న్న బిడ్డ‌గా ఏపీ అధికార పీఠాన్ని అధిరోహించిన ఆయ‌న కుమారుడు జ‌గ‌న్‌.. తిరిగి ఈ ప‌థ‌కానికి ఊపిరులూదారు.

ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల‌ను క‌లిసి న‌ప్పుడు తాను అధికారంలోకి వ‌స్తే.. ఆరోగ్య శ్రీని మ‌రింత అభివృద్ధి చేస్తా న‌ని ఇచ్చిన మాట‌ను సీఎంగా ప్ర‌మాణం చేసిన కేవ‌లం 5 రోజుల్లోనే నిల‌పుకొనేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే దీనిని తానే స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తాన‌ని ప్ర‌క‌టించారు. అదేస‌మ‌యంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీగా దీనికి స‌రికొత్త పేరు పెట్టారు. సాధార‌ణంగా వైద్య రంగంలో ఏదైనా ఆవిష్క‌ర‌ణ జ‌రిగితే.. దానిని ఆవిష్క‌ర్త‌ల పేరునే పెడుతూ ఉంటారు. ఉదాహ‌ర‌ణ‌కు పెన్సిలిన్ అనే శాస్త్ర‌వేత్త క‌నిపెట్టిన ఇంజ‌క్ష‌న్‌కు ఆయ‌న పేరునే పెట్టారు. అలాగే ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టిన వైఎస్ పేరును ఆ ప‌థ‌కాన్ని ఇప్ప‌టికైనా పెట్టినందుకు పేద‌లు, ముఖ్యంగా రాష్ట్రంలోఈ ప‌థ‌కాన్ని వినియోగించుకుంటున్న కోట్ల మంది కూడా హ్యాపీగా ఫీల‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఆరోగ్య శ్రీ ఆవిష్క‌ర్త‌కు అస‌లైన నివాళి.. గ్రేట్ జ‌గ‌న్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts