జగన్ డేరింగ్ నిర్ణయం:ఏపీ శాసన మండలి రద్దు?

June 7, 2019 at 11:06 am

అవును! ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపైనే చ‌ర్చ సాగుతోంది. రాష్ట్రంలో కీల‌క‌మైన చ‌ట్ట‌స‌భ‌గా గుర్తింపు తెచ్చుకు న్న శాస‌న మండ‌లి విష‌యంలో జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు? రాష్ట్రాధినేత నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి న‌డుస్తు న్న మండ‌లి విష‌యంలో ప్ర‌స్తుతం పెద్ద చ‌ర్చ న‌డుస్తోంది. గ‌త అనుభ‌వాలు కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నా యి. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ విజ యం దుందుభి మోగించి అసెంబ్లీలో 175 సీట్ల‌కు గాను 151 సీట్ల‌ను కైవ‌సం చేసుకున్నారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీలో జ‌గ‌న్‌కు ఎదురు లేకుండా పోయింది. ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాల‌ను ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న‌ప్ప‌టికీ.. టీడీపీకి ఎదుర్కొనే శ‌క్తి లేద‌ని అంటున్నారు. దీంతో అసెంబ్లీలో జ‌గ‌న్‌కు ఎదురు గాలే లేకుండా పోయింది.

కానీ, మండ‌లి విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ 31 మంది స‌భ్యుల‌తో టీడీపీ బ‌లంగా ఉంది. దీంతో ప్ర‌భుత్వం చేసే చ‌ట్టాల‌ను అసెంబ్లీలో నిలువ‌రించి, అడ్డు చెప్పే అవ‌కాశం లేక‌పోయినా.. చంద్ర‌బాబు త‌న త‌మ్ముళ్లుగా పిల‌వ‌బ‌డే మండ‌లిలో స‌భ్యుల‌తో జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అంటే అసెంబ్లీలో ఒక చ‌ట్టం ఓకే అయినా.. దానికి మండ‌లిలో అడ్డు చెప్పేందుకు టీడీపీకి మెజారిటీ సంఖ్యాబలం ఉంది. ఈ స‌భ్యుల ప‌ద‌వీ కాలాలు తీరిపోయి మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌చ్చేందుకు విడ‌త‌ల వారీగా స‌మ‌యం కూడా చాలా ప‌డుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుంటే.. జ‌గ‌న్ త‌న‌కున్న విస్తృత అధికారాన్ని వినియోగించి ఏకంగా మండ‌లినే ర‌ద్దు చేస్తే.. పోలా! అనుకుంటే.. త‌మ్ముళ్లు ఇంటికే ప‌రిమిత‌మై పోయి.. జ‌గ‌న్ ప‌నిసులువు అవుతుంద‌ని ఓ వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ఇక‌, ర‌ద్దు విష‌యంలో జ‌గ‌న్‌కు క‌లిసి వ‌చ్చే మ‌రో విష‌యం కూడా ఉంది. అదే పొదుపు మంత్రం! రాష్ట్రం తీవ్ర‌మైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేప‌థ్యంలో సీఎంగా ఆయ‌న త‌న వేత‌నాన్ని పూర్తిగా త‌గ్గించుకున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై అసెంబ్లీలో నే ఒక ప్ర‌క‌ట‌న చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలో దీనిని అడ్డుపెట్టి మండ‌లిని ర‌ద్దు చేస్తార‌ని మ‌రో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఇక్క‌డ చిన్న ట్విస్ట్ ఉంది. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ స‌మ‌న్వయ‌క‌ర్త‌లుగా ఉన్న‌వారు తాజా ఎన్నిక‌ల్లో పోటీ నుంచి త‌ప్పుకొని జ‌గ‌న్ చెప్పిన‌ట్టు నడుచుకున్నారు. వీరికి ఎమ్మెల్సీ సీట్లు ఇస్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో చిల‌క‌లూరిపేట నుంచి మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, హిందూపురంలో ఓట‌మి పాలైన మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్‌కు ఎమ్మెల్సీగా చోటు ల‌భించే అవ‌కాశం ఉంది.

కాబ‌ట్టి వీరిని దృష్టిలో పెట్టుకుంటే.. మండ‌లిని ర‌ద్దు చేసే ఆలోచ‌న జ‌గ‌న్ చేయ‌బోర‌ని అంటున్నారు. అంతేకాదు పార్టీలో సీనియ‌ర్లుగా ఉన్న ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు వంటి వారు ఎమ్మెల్సీలుగా కొన‌సాగుతున్నారు కాబ‌ట్టి.. వారికి అన్యాయం చేయ‌కూడ‌ద‌నే త‌లంపు కూడా జ‌గ‌న్‌కు ఉంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో మండ‌లిని ర‌ద్దు చేయ‌ర‌ని అంటున్నారు కూడా క‌నిపిస్తున్నారు. ఒక వేళ మండ‌లిని ర‌ద్దు చేస్తే.. మొత్తానికి మొత్తంగా న‌ష్ట‌పోయేది మాత్రం టీడీపీనే. ఇప్ప‌టికే ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో మ‌ట్టిక‌రిచిన ఈ పార్టీ ఇప్పుడు మండ‌లిని కూడా ర‌ద్దు చేస్తే.. పూర్తిగా నేల‌మ‌ట్టం కావ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యానికి అత్యంత ప్రాధాన్యం ఏర్ప‌డింది. దీనిపై క్లారిటీ కోసం కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే!

జగన్ డేరింగ్ నిర్ణయం:ఏపీ శాసన మండలి రద్దు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts