వైసీపీ కొత్త ఎమ్మెల్సీలుగా వారికే ఛాన్స్‌!

June 7, 2019 at 10:29 am

ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీకి ఈ ద‌ఫా మెజారిటీ స్థానాలు కైవ‌సం చేసుకున్న నేప‌థ్యంలో అంతే రేంజ్‌లో ఎమ్మె ల్సీ స్థానాలు కూడా దక్కే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. ముఖ్యంగా తాజా ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎమ్మెల్సీలు ఉండ‌డంతో వారు రాజీనామాలు చేయ‌డంతో ఆయా సీట్లు కూడా వైసీపీకి ద‌క్క‌నున్నాయి. ఇక‌, వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా ఉండి.. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నాయ‌కులు కూడా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా స‌మ‌ర్పించాల్సిన అవ‌స రం వ‌చ్చింది. దీంతో వారు కూడా రిజైన్ చేస్తే.. మొత్తంగా 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి.

ఈ నేప‌థ్యంలో వైసీపీలో ఎవ‌రికి ఎమ్మెల్సీ స్థానాలు ద‌క్కుతాయి? రేసులో ఎవ‌రెవ‌రున్నారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోం ది. ముఖ్యంగా ప్ర‌స్తుతం కేబినెట్ ఏర్పాటులో బిజీగా ఉన్న వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. ఇప్ప‌టికే ఈ ఎమ్మెల్సీ సీట్ల‌ను ఎవ‌రికి కేటాయించాల‌నే విష‌యంపై క్లారిటీతో ఉన్నార‌ని స‌మాచారం. ఇద్ద‌రికి మాత్రం ఖ‌చ్చితంగా ఎమ్మెల్సీ ఛాన్స్ ద క్కుతుంద‌ని అంటున్నారు. వారిలో గుంటూరు జిల్లా చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌య క‌ర్త‌గా ప‌నిచేసి.. జ‌గ‌న్ ఆదేశాల‌తో ఎన్నిక‌ల్లో పోటీ నుంచి త‌ప్పుకొన్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు త‌న ప్ర‌భుత్వం వ‌స్తే.. కేబినెట్ బెర్త్ ఇస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

అదేవిధంగా అనంత‌పురం జిల్లా హిందూపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్‌కు కూడా ఎమ్మెల్సీ ప‌ద‌విని ఇస్తాన‌ని జ‌గ‌న్ ఇటీవ‌ల జ‌రిగిన రంజాన్ ఇఫ్తార్ విందులో బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో మ‌ర్రి, ఇక్బాల్ స్థానాలు స‌రిపోయాయి. అయితే, లెక్క ప్ర‌కారం మ‌రో సీటు ఖాళీగా ఉండ‌నుంది. దీంతో ఈ సీటును ఎవ‌రికి ఇస్తార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ సీఎం చంద్ర‌బాబుపై పోటీ చేసి ఓడిపోయిన చంద్ర‌మౌళికి ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. నిజానికి చంద్ర‌బాబుకు ఈ ఎన్నిక‌ల్లో భారీ ఓట్ల మెజారిటీ త‌గ్గిపోయింది. దాదాపు గ‌త ఎన్నిక‌ల‌తో పోల్చుకుంటే 17 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ త‌గ్గింది. దీనికి కార‌ణం చంద్ర‌మౌళేన‌ని జ‌గ‌న్ ప్ర‌గాఢంగా న‌మ్ముతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను ప్రోత్స‌హించేందుకు, ద‌న్నుగా ఉండేందుకు ఎమ్మెల్సీ సీటును ఆఫ‌ర్ చేయ‌నున్నార‌ని అంటున్నారు. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.

వైసీపీ కొత్త ఎమ్మెల్సీలుగా వారికే ఛాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts