భార‌త్‌కే బంగారు హిమ‌దాస్‌..!

July 22, 2019 at 4:19 pm

భార‌త దేశానికి బంగారు ప‌త‌కాలు అందిస్తున్న బంగారుబాతు హిమ‌దాస్‌. కేవ‌లం 20రోజుల వ్య‌వ‌ధిలోనే 5బంగారు ప‌త‌కాలు సాధించి భార‌త ప‌తాకను ప్ర‌పంచ వ్యాప్తంగా రెప‌రెప‌లాడిస్తుంది. హిమ‌దాస్ ఎక్క‌డ కాలుమోపిందంటే అక్క‌డ బంగారు ప‌త‌కాలు ఆమేకు పాదాక్రాంత‌మ‌వుతున్నాయి. పేరుకు మాత్ర‌మే మంచులాంటి హిమం కానీ ప‌రుగులో మాత్రం రాకెట్‌ను మంచిన వేగం. అందుకే బంగారు ప‌త‌కాలు హిమ‌దాస్‌కు సొంతం అవుతున్నాయంటే అతిశ‌యోక్తి కాదు.

భార‌త స్ప్రింట‌ర్ హిమ‌దాస్ జూలై 2న పోలాండ్‌లో పొజ్నాన్ అథ్లేటిక్ గ్రాండ్ ప్రిలో ప్రారంభించిన బంగారు ప‌త‌కాల ప‌రుగును ఈనెల 17న జ‌రిగిన పోట వ‌ర‌కు నిరాఘాటంగా కొన‌సాగిస్తూనే ఉంది. ఇప్ప‌టికే 20 రోజుల్లో ఐదు ప‌త‌కాలు సాధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఏ భారతీయ వ‌నిత సాధించ‌ని ఘ‌న‌త‌కు సొంతం చేసుకుంది. లేడి పిల్ల‌లా క‌నిపించే హిమాదాస్ రాకెట్ ను మించిన వేగంతో ప‌రుగులు తీస్తూ త‌న ప‌త‌కాల వేట‌ను సాగిస్తూ దేశానికే గ‌ర్వ‌కార‌ణంగా నిలుస్తుంది.

జూలై 2న త‌న మొద‌టి బంగారు ప‌త‌కం సాధించిన హిమ‌దాస్ జూలై 7న పోలాండ్‌నే 200మీట‌ర్ల రేసులో స్వ‌ర్ణం సాధించింది. ఇక జూలై 13న చెక్ రిప‌బ్లిక్‌లో జ‌రిగిన మీట్‌లో మూడో బంగారు ప‌త‌కాన్ని, అదే దేశంలో 17న జ‌రిగిన టాబ‌ర్ మీట్‌లో రెండు బంగారు ప‌త‌కాలు సాధించి చ‌రిత్ర సృష్టించింది. హిమ‌దాస్ సాధించిన ఈ ఘ‌న‌త‌కు దేశ ప్ర‌థ‌మ పౌరుడు రామ్ నాథ్ కోవింద్‌, దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీతో పాటు దేశ వ్యాప్తంగా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. సో భారత ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిన హిమ‌దాస్‌కు జాతి యావ‌త్తు ప్ర‌శంస‌లు కురిపిస్తుంది.

భార‌త్‌కే బంగారు హిమ‌దాస్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)