వైసీపీలోకి బోండా ఉమా..!

July 22, 2019 at 3:45 pm

టీడీపీ ప‌రిస్థితి మ‌రీ దారుణంగా త‌యారైంది. ఆ పార్టీ నాయ‌కులు కొంద‌రు ఓ వైపు బీజేపీ వైపు చూస్తుండ‌గా, మ‌రికొంద‌రు అధికార వైసీపీలో చేర‌డానికి ఉత్సుక‌త చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలోకి వెళ్లిన విష‌యం తెలిసిందే. బీజేపీ ముఖ్య‌నేత‌లు ప్ర‌ధానంగా ఎటు తెలంగాణ‌లో, ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌మ ఫోక‌స్ పెట్టారు. ఈ క్ర‌మంలోనే ఆ పార్టీకి కొద్దికొద్దిగా వ‌ల‌స‌ల జోరందుకుంది. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార వైసీపీలోకి కూడా వ‌ల‌స‌లు జోరందుకున్నాయి.

తెలుగుదేశం పార్టీలో త‌మ‌కు స‌రైన ఆద‌ర‌ణ లేక‌పోవ‌డం, అధికారంలో ఉన్న పార్టీ ప్ర‌జాద‌ర‌ణ‌తో అప్ర‌తిహాతంగా దూసుకెళ్ల‌డం త‌దిత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో వ‌ల‌స‌లు జ‌రుగుతున్నాయి. అదే బాట‌లో టీడీపీ ఫైర్‌బ్రాండ్‌, విజ‌య‌వాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డానికి లైన్ క్లియ‌ర్ చేసుకుంటున్నాడు. తెలుగుదేశానికి గుడ్‌బై చెప్పి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలోకి చేర‌డానికి పావులు క‌దుపుతున్న‌ట్టు స‌మాచారం.

2017 లో అప్ప‌టి ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబునాయుడు త‌న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఉమాకు స్థానం క‌ల్పించ‌లేదు. ఆ త‌ర్వాత ఏదో మొక్కుబ‌డిగా ఉన్న‌ట్టు ఆయ‌న‌కు అధినేత టీటీడీ బోర్డు స‌భ్యుడిగా అవ‌కాశం క‌ల్పించారు. అప్ప‌టి నుంచి అసంత్రుప్తిగా ఉన్న‌ప్ప‌టికీ స‌రైన స‌మ‌యం కోసం ఉమా వేచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆ పార్టీలో తాను ఎన్నెన్నో ఊహించుకున్న‌ప్ప‌టికీ ఆయ‌న‌కు స‌రైన ప్రాధాన్యం ద‌గ్గ‌లేద‌ని ఆయ‌న స‌న్నిహితులు పేర్కొంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పార్టీ మారాల‌ని, అందునా వైసీపీలో చేరి జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆయ‌న అభిమానులు తెలుపుతున్నారు.

వైసీపీలోకి బోండా ఉమా..!
0 votes, 0.00 avg. rating (0% score)