సాహో ఒక్క‌సీన్‌కే 70కోట్లు..?

July 16, 2019 at 4:44 pm

హాలీవుడ్ రేంజ్‌లో తెర‌కెక్కుతున్న సాహో సినిమా లో ఒక్క ఫైట్‌సీన్ షూట్ చేసేందుకు చేసిన ఖ‌ర్చు ఎంతంటే… రూ.70కోట్ల‌ట‌. ఇంత మొత్తంలో ఒకే సీన్ షూటింగ్‌కు కెటాయించారంటే సినిమాపై భారీ హైప్ క్రియోట్ చేస్తోంది. ఒక్క‌సీన్‌కే ఇంత భారీ బ‌డ్జెట్ కెటాయించ‌డం అంటే ఆ సీన్ సినిమాకు ప్ర‌ధాన ఆయువుప‌ట్టుగా ఉంటుంద‌నే వార్త‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమా త‌రువాత న‌టిస్తున్న సినిమా సాహో. యూవీ క్రియోష‌న్స్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ చిత్రంకు భారీ బ‌డ్జెట్‌తో కెటాయించారు. సుమారు 300కోట్ల రూపాయ‌ల‌తో ఈ సినిమాను హాలీవుడ్ టెక్నిషియ‌న్స్, కొంద‌రు న‌టులు న‌టిస్తున్నారు. బాలీవుడ్‌, హాలీవుడ్‌లోను సాహోకు ఎంతో క్రేజ్ ఏర్ప‌డింది.

అయితే సాహో సినిమా షూటింగ్ ఎట్ట‌కేల‌కు ముగిసి ఇప్పుడు సినిమా అనంత‌ర కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తున్నారు. అయితే సినిమాకు సంబంధించిన ఒక్కో అప్‌డేట్ లీక్ అవుతున్నాయి. అందులో భాగంగానే ఒక్క ఫైట్ సీన్‌కు రూ.70కోట్లు కెటాయించారు. ఈ ఫైట్ సీన్ సినిమాలో క్లైమాక్స్ ఫైట్‌గా సుమారు 8నిమిషాల నిడివితో ఉంటుంద‌ని టాక్‌. ఈ ఫైట్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంద‌ని చిత్రయూనిట్ అంత భారీ ఖ‌ర్చు పెట్టిన‌ట్లు వినికిడి.

సాహో ఒక్క‌సీన్‌కే 70కోట్లు..?
0 votes, 0.00 avg. rating (0% score)