ఐశ్వర్య రాయ్ కండిష‌న్‌కు చిరుకి షాక్‌…!

July 13, 2019 at 4:27 pm

నా కండిష‌న్‌కు ఒప్పుకుంటే నేను న‌టించేందుకు సిద్దం. అంతే కాదు, నా ఇష్టం వ‌చ్చిన‌ప్పుడు షూటింగ్‌కు వ‌స్తా.. మీ ఇష్టం వ‌చ్చిన‌ప్పుడు ర‌మ్మంటే రాను… అది కూడా ముంబైలో షూటింగ్ అయితేనే న‌టిస్తా… హైద‌రాబాద్‌లో అయితే రాను.. ఏమంటారో మీరే ఆలోచించుకోండి అంటూ కండిష‌న్ల మీద కండిష‌న్లు పెట్టింద‌ట ఈ ప్ర‌పంచ మాజీ సుంద‌రి. ఇంత‌కు ఏ సినిమా కోసం ఈ ప్ర‌పంచ మాజీ సుంద‌రి కండిష‌న్ పెట్టింద‌నుకుంటున్నారా… అదేనండీ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రాబోవు మెగాస్టార్ చిరంజీవి సినిమాకు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా చిరంజీవి స‌ర‌స‌న న‌టించేందుకు ప్ర‌పంచ మాజీ సుంద‌రి, బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కోడ‌లు ఐశ్వ‌ర్య‌రాయ్‌ను సంప్ర‌దించిందట చిత్ర బృందం. దీంతో ఐశ్వ‌ర్య‌రాయ్ తాను సినిమాలో న‌టించేందుకు సిద్ద‌మే కానీ కొన్ని కండీష‌న్లు ఉన్నాయంటూ కండీష‌న్ల చిట్టా విప్పింద‌ట‌.

సినిమాకు బ‌ల్క్ డేట్స్, నిర్మాత కోరిన‌న్ని డేట్స్ కూడా ఇవ్వ‌లేన‌ని స్ప‌ష్టం చేసిందట‌. షూటింగ్‌ ముంబాయిలో అయితేనే న‌టిస్తాన‌ని, హైద‌రాబాద్‌లో అయితే కుద‌రంద‌ట‌. ఇక నైట్ షూటింగ్‌లు నాకు స‌రిప‌డ‌వ‌న్న‌ద‌ట‌. దీంతో పాటుగా ఇక పారితోషికంగా రూ.4కోట్లు ఇవ్వాల‌ని డిమాండ్ చేసింద‌ట‌. దీంతో పాటుగా త‌న వ్య‌క్తిగ‌త హెయిర్ డ్రెస‌ర్‌కు, వ్య‌క్తిగ‌త మేక‌ప్‌మెన్‌కు భారీ మొత్తం పారితోషికం ఇవ్వాలంట‌. ఈ డిమాండ్ల చిట్టా విన్న మెగాస్టార్ మొహంలో నెత్తురు ఆవిరైపోయింద‌ట‌. సో ఇప్పుడు ఐష్ కోరిక‌ను చిరు తీర్చుతాడ‌… లేదా పాత చింత‌కాయ ప‌చ్చ‌డితోనే నెట్టుకొస్తారా అనేది వేచిచూడాల్సిందే.

ఐశ్వర్య రాయ్ కండిష‌న్‌కు చిరుకి షాక్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts