అయ్యో అఖిల్‌… ఎన్ని క‌ష్టాలో

July 1, 2019 at 11:13 am

అక్కినేని ఫ్యామిలీ బ్రాండ్‌తో హీరోగా ఎంట్రి ఇచ్చిన అఖిల్ మూడు వ‌రుస డిజాస్ట‌ర్లు ఇచ్చాడు. నాగ‌చైత‌న్య కంటే అఖిల్ కోసం నాగార్జున ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. తొలి మూడు సినిమాల‌తో ఒక్క హిట్ కూడా లేదు. కోట్లాది రూపాయ‌ల‌తో తీసిన అఖిల్ – హ‌లో డిజాస్ట‌ర్‌. మిస్ట‌ర్ మ‌జ్ను కూడా ప్లాపే. ఇప్పుడు నాలుగో సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ష‌న్‌లో చేయ‌బోతోన్న సంగ‌తి తెలిసిందే.

అల్లు అర‌వింద్ నిర్మించే ఈ సినిమాకు ముందు నుంచి ఆయ‌న అన్ని కోత‌లే పెట్టేస్తున్నార‌ట‌. బ‌డ్జెట్ చాలా కంట్రోల్‌లో ఉండాల‌న్న‌దే అర‌వింద్ ప్లాన్. గ‌తంలో చైతుకు అర‌వింద్ 100 % ల‌వ్ లాంటి హిట్ సినిమా ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అందుకే ఇప్పుడు నాగ్ అఖిల్‌కు హిట్ ఇచ్చే బాధ్య‌త‌ల‌ను అర‌వింద్ చేతుల్లో పెట్టారు.

ఈ సినిమా షూటింగ్ నెల‌న్న‌ర రోజుల క్రింద‌టే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే హీరోయిన్ దొర‌క్క వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వ‌స్తున్నారు. ప‌లువురు హీరోయిన్ల పేర్లు పరిశీలించినా కొంద‌రు అఖిల్‌కు న‌చ్చ‌క‌పోవ‌డం… అఖిల్ చాయిస్ ఉంటే బ‌డ్జెట్ ఎక్కువైంద‌ని అర‌వింద్ కండీష‌న్ పెడుతుండ‌డంతో చివ‌ర‌కు హీరోయిన్ ఎంపిక పెద్ద చిక్కుముడిలా మారింది.

ఒక్క హిట్ కోసం అక్కినేని వార‌సుడు ప‌డుతోన్న క‌ష్టాల‌ను చూసిన ఇండ‌స్ట్రీ జ‌నాలు అయ్యో పాపం అఖిల్ అని జాలిప‌డుతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం అఖిల్ సరసన దాదాపు రష్మికా మండన్ననే హీరోయిన్ గా ఫైనల్ చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె కూడా చాలా బిజీగా ఉండ‌డంతో ఓకే చెపుతుందా ? లేదా ? అన్న‌ది డౌటే.

అయ్యో అఖిల్‌… ఎన్ని క‌ష్టాలో
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts