బ‌న్నికి ఆ భామే కావాల‌ట‌…!

July 2, 2019 at 11:48 am

ఒక‌ప్పుడు న‌టుల‌ను, సాంకేతిక నిపుణుల‌ను ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఎంపిక చేసేవారు. క‌థ‌కు అనుగుణంగా న‌టించే సామార్థ్యం ఉన్న న‌టీన‌టుల‌ను ఎంపిక చేస్తే ఎవ‌రి ప‌రిధిలో వారు ప‌నిచేసేవారు. అప్పుడు హీరోలు కూడా త‌మ ప‌క్క‌న ఎవ‌రు న‌టిస్తున్నారో ఎవ్వ‌రికి పెద్ద‌గా తెలిసేది కాకుండేది… కానీ రోజులు మారాయి. మ‌నుషులు మారారు. హీరోలు మారారు… ఎవ్వ‌రికి న‌చ్చిన‌వారిని వారే ఎంపిక చేసుకుంటున్నారు.

ద‌ర్శ‌కుల‌కు ఫ‌లానా హీరోయిన్‌ను ఎంపిక చేశామంటే అదేట్లా కుదురుద్ది… ఆమే వ‌ద్దు ఫ‌లానామా అయితే బాగుంట‌ది… మీరు సెట్ చేయండ‌ని హీరో ఆదేశించే స్థాయికి టాలీవుడ్ ఎదిగింది. హీరోలు త‌మ ప‌క్క‌న న‌టించే హీరోయిన్ల‌ను ఏరీ కోరి ఎంచుకుంటున్నారు. అదే వ‌రుస‌లో ఇప్పుడు బ‌న్ని ఉర‌ప్ అల్లు అర్జున్ కూడా చేరిపోయారు. బ‌న్నీ న‌టిస్తున్న సినిమాలో ఫ‌లానా అమ్మాయిని ఎంపిక చేయ‌మ‌ని ద‌ర్శ‌కుడిగా చెప్పాడ‌ట‌. ఇప్పుడు అది హాట్ టాపిక్‌గా మారింది.

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ న‌టించే సినిమా సెట్స్ మీదుంది. ఈ సినిమాలో ఇప్ప‌టికే ఒక హీరోయిన్‌గా పూజాహెగ్డెను ఎంపిక చేశారు. మ‌రో హీరోయిన్ అవ‌స‌రం ప‌డింది. దీంతో మెంట‌ల్ మ‌దిలో, చిత్ర‌ల‌హ‌రి, బ్రోచేవారెవ‌రురా అనే సినిమాల్లో న‌టించిన సుంద‌రి నివేదా పేతురాజ్ పేరును బ‌న్ని సూచించాడ‌ట‌. ఎందుకంటే ఆ అమ్మ‌డికి టాలీవుడ్‌లో లిప్ట్ ఇద్దామ‌నే ఆలోచ‌న‌లో బ‌న్ని ఉన్నాడ‌ట‌.. మ‌రి ఈ భామ‌నే ఎందుకు ఎన్నుకున్న‌ట్లు, ఈమేకు ఎందుకు లిప్ట్ ఇవ్వ‌డం అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. సో నివేదా పేతురాజ్‌కు బ‌న్నికి ఎక్క‌డ కుదిరిందో జోడీ… మ‌రి ఈ సినిమాలో జోడి క‌డుతుందో లేదో చూడాల్సిందే…

బ‌న్నికి ఆ భామే కావాల‌ట‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts