సోషల్ మీడియాలో బ‌న్నీ బ‌డాయి ఎక్కువైపోలా…!

July 12, 2019 at 10:46 am

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు. బన్నీ తనను తాను ప్రమోట్ చేసుకోవడంతో పాటు తన సినిమాలకు హైప్ వచ్చేందుకు సోషల్ మీడియాను వాడుకోవడాన్ని ఎవరు తప్పు పట్టారు. అయితే ఇప్పుడు బన్నీ పీఆర్ టీం చేస్తున్న పనులే బన్నీ మరి అతి చేస్తున్నాడా ? అన్న చర్చలకు కారణమవుతున్నాయి. సోషల్ మీడియాలో అభిమాన సంఘాలను మేనేజ్ చేయడంలో బన్నీ సినిమాలు… అతడి వ్యక్తిగత అంశాలు ప్రమోట్ చేయడంలో అతడి పీఆర్ టీం వ్యూహాలు కొత్తగా ఉంటాయి.

బన్నీ ఏం చేసినా దానిని అప్పటికప్పుడే అతడి పీఆర్ టీం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అంతెందుకు ఇటీవల బన్నీ బ్రోచేవారెవరురా….. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి చిన్న సినిమాలు చూస్తే దానిని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రమోట్ చేశారు. ఇక ఓ బేబీ సినిమా చూసి ఫోన్ చేసి అభినందిస్తే ఆ ప్రచారం కూడా అదరగొట్టేసారు. సాధారణంగా రాజమౌళి ఇలాంటి క్రేజీ డైరెక్టర్ ఏదైనా సినిమా చూసి దానిపై సోషల్ మీడియాలో తన అభిప్రాయం చెబితే వచ్చే క్రేజ్‌కు మించిన క్రేజ్ బ‌న్నీకి వ‌స్తోంది. అయితే ఇదంతా ప‌క్కా ప్లానింగ్‌తోనే న‌డుస్తోంద‌న్న‌ది ఇండ‌స్ట్రీ టాక్‌?

దసరా టైంలో బన్నీ పల్లెటూరికి వెళ్లినా అభిమానుల‌తో ఫొటోలు దిగితే జ‌రిగే హంగామా ? అంతా ఇంతా కాదు. వాటికి మెయిన్ మీడియాలో ఓ రేంజులో ప్ర‌చారం క‌ల్పించేలా చేశారు. ఇక తాజాగా బన్నీ వ్యానిటీ వ్యాన్ ‘ఫాల్కన్’ గురించి సామాజిక మాధ్యమాల్లో ఎంత హడావుడి నడుస్తోందో తెలిసిందే. ఏకంగా ఏడు కోట్లు ఖర్చు పెట్టి ఈ వ్యాన్ డిజైన్ చేయించుకున్నాడు బన్నీ. కొంత‌మంది ఇంత ల‌గ్జ‌రీనా ? అని కూడా సెటైర్లు వేస్తున్నారు.

ఏదేమైనా బ‌న్నీ కావాల‌ని హైప్ తెచ్చుకునేందుకే ఇదంతా చేస్తున్నాడా ? అన్న చ‌ర్చ‌లు కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. అత‌డి సినిమాల కంటే ఇత‌ర‌త్రా విష‌యాల‌కే ఎక్కువ ప‌బ్లిసిటీ స్టంట్ జ‌రుగుతోంద‌ని కూడా అంటున్నారు.

సోషల్ మీడియాలో బ‌న్నీ బ‌డాయి ఎక్కువైపోలా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts