ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ వెన‌క బీజేసీ స్కెచ్ ఇదే…

July 16, 2019 at 7:40 pm

ఏపీకి కేంద్రం కొత్త గవర్నర్‌ను నియమించింది. ఇప్పటి వరకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ స్థానంలో ఏపీకి బీజేపీ సీనియర్ నేత విశ్వభూషణ్ హరిచందన్‌ను కేంద్రం నియమించింది. ఈమేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. నరసింహన్‌ ఇకపై తెలంగాణకు మాత్రమే గవర్నర్‌గా వ్యవహరిస్తారు. ప్ర‌స్తుతం ఏపీకి గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న న‌ర‌సింహాన్ మొత్తం 12 ఏళ్ల పాటు గ‌వ‌ర్న‌ర్‌గా కంటిన్యూ అయ్యి స‌రికొత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నారు.

వాస్త‌వానికి 2014లో రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాకే ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్‌ను నియ‌మించాల‌ని అనుకున్నారు. అయితే అప్ప‌టి ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎన్డీయేలో ఉండ‌డంతో రెండు తెలుగు రాష్ట్రాల స‌మ‌స్య‌ల‌పై మంచి అవ‌గాహ‌న ఉన్న న‌ర‌సింహాన్‌నే కంటిన్యూ చేయాల‌ని ఎన్డీయేకు సూచించారు. దీంతో గ‌వ‌ర్న‌ర్‌ను కేంద్రం మార్చ‌లేదు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు ప‌దే ప‌దే యూట‌ర్న్‌లు తీసుకుని కేంద్రంతో గొడ‌వ పెట్టుకోవ‌డంతో… చివ‌ర‌కు అదే న‌ర‌సింహాన్‌ను వాడుకుని కేంద్రం చంద్ర‌బాబును ముప్పుతిప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది.

అదే టైంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు న‌ర‌సింహాన్ ట‌ర్మ్స్ బాగుండ‌డంతో కేసీఆర్ కూడా ఆయ‌న్నే కోరుకున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణ‌లో కేసీఆర్ మ‌ళ్లీ సీఎం అవ్వ‌గా… ఏపీలో జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కొత్త సీఎం అయ్యారు. ఈ రెండు సీఎంల మ‌ధ్య అవ‌గాహ‌న ఉన్న నేప‌థ్యంలో న‌ర‌సింహ‌నే కొన‌సాగ‌వ‌చ్చ‌ని అంద‌రూ భావించారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని ప‌టిష్టం చేసుకునే ప్లాన్‌లో ఉన్న బీజేపీ ఇప్పుడు ఏపీపై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌నే కొత్త గ‌వ‌ర్న‌ర్‌ను నియ‌మించింద‌న్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఇక ఏపీ కొత్త గ‌వ‌ర్న‌ర్ అయిన విశ్వభూషణ్‌ హరిచందన్‌ వయసు 85 ఏళ్లు. ఈయన స్వస్థలం ఒడిషా. మూడు సార్లు బీజేపీ నుంచి గెలవగా జనతా, జనతాదళ్‌ పార్టీల నుంచి మరో రెండు సార్లు గెలిచారు. మొత్తంగా ఐదుసార్లు ఆయ‌న ఒడిశా అసెంబ్లీకి ప్రాథినిత్యం వ‌హించారు. భువనేశ్వర్‌ నుంచి మూడు సార్లు గెలిచిన ఆయన సిలికా నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించారు.

ఇక విశ్వ‌భూష‌ణ్ రాజ‌కీయ ప్ర‌స్థానం 1971లో జనసంఘ్‌తో ప్రారంభ‌మైంది. ఆ త‌ర్వాత లా విద్య అభ్య‌సించిన ఆయ‌న ఒడిశా రాష్ట్ర న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మారుబటాస్‌, రాణా ప్రతాప్‌, శేషజలక్‌, అస్తశిఖ వంటి పలు పుస్తకాలు రచించారు. ఒడిశా బీజేపీ ఉపాధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ఇక ఇప్పుడు అన‌ఫీషియ‌ల్‌గా బీజేపీ ప్ర‌తినిధిగా ఏపీలో ఎంట్రీ ఇస్తోన్న విశ్వ‌భూష‌ణ్ ఇక్క‌డ వైసీపీ ప్ర‌భుత్వంలో ఎలాంటి సంబంధాలు కంటిన్యూ చేస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రం.

ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ వెన‌క బీజేసీ స్కెచ్ ఇదే…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts