బాల‌య్య కిక్‌కు బొల్తాప‌డ్డ బోయ‌పాటి…!

July 1, 2019 at 5:50 pm

నంద‌మూరి బాల‌కృష్ణ ఉర‌ప్ బాల‌య్య బాబు ఇచ్చిన మాస్ట‌ర్ కిక్‌కు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి బొల్తాప‌డ్డాడ‌ట‌. బాల‌య్య బాబు ను తెలుగు తెర‌పై త‌న‌దైన మార్కు ద‌ర్శ‌క‌త్వంతో చూపించిన ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీ‌నుకు ఇప్పుడు బాల‌య్య తో క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. బాల‌య్య‌కు రెండు కేరీర్ హిట్లు ఇచ్చిన బోయ‌పాటిని కాద‌ని కె.ఎస్‌.ర‌వికుమార్‌తో జ‌త‌క‌ట్ట‌డం విశేషం.

బాల‌య్య ముందుగా బోయ‌పాటితో సినిమా చేద్దామ‌ని చెప్ప‌డంతో ఒక మంచి ధ‌మ్మున్న క‌థ‌ను త‌యారు చేశాడ‌ట‌. స్క్రిప్ట్ పూర్తి చేసిన త‌రువాత క‌థ‌ను విన్నాడ‌ట బాల‌య్య‌. బోయ‌పాటి చెప్పిన క‌థ న‌చ్చిన‌ప్ప‌టికి లెంత్ ఎక్కువ‌గా ఉంద‌ని, దాన్ని కొంత షార్టు చేయాల‌ని చెప్ప‌డంతో బోయ‌పాటి క‌థ‌ను క‌త్తిరించి మ‌ళ్ళీ సిద్ధం చేశాడ‌ట‌. సినిమా బ‌డ్జెట్ కూడా ఎక్కువ‌గా అవుతుంద‌ని దాన్ని త‌గ్గించాల‌ని చెప్ప‌డంతో దానికి కూడా స‌రేన‌న్న బోయ‌పాటి బ‌డ్జెట్‌ను కూడా ఎట్ట‌కేల‌కు కుదించాడు.

కుదించిన బ‌డ్జెట్‌, క‌త్తిరించిన క‌థ‌ను మ‌ళ్ళీ బాల‌య్య కు వినిపించాడు బోయ‌పాటి. క‌థ‌ను విన్న బాల‌య్య బోయ‌పాటికి ఏమి చెప్ప‌కుండానే చూద్దాం లే… అని అన్నాడ‌ట‌. ఇక క‌థ విన్న బాల‌య్య బోయ‌పాటికి సినిమా చేద్దామా వ‌ద్దా.. ఎప్పుడు చేద్దాం, ఎలా చేద్దాం అనే మాటా ముచ్చ‌ట లేకుండానే గ‌డిపేస్తున్నాడ‌ట‌. ఎండాకాలం నుంచి ఇదే తంతుసాగుతుంద‌ట‌. దీంతో బోయ‌పాటికి క‌క్క‌లేక మింగ‌లేక‌, బాల‌య్య బాబును ఏమి అన‌లేక మ‌రో సినిమా మ‌రో హీరోతో చేసుకోలేక స‌త‌మ‌వుతున్నాడ‌ట‌. సో ఇప్పుడు బాల‌య్య ఇచ్చిన దెబ్బ‌కు బోయ‌పాటి మైండ్ దొబ్బింద‌నే అనుకుంటున్నారు నెటిజ‌న్లు. బాల‌య్య‌కు సింహా, లెజెండ్ హిట్లు ఇచ్చిన బోయ‌పాటికి ఎంత క‌ష్టం వ‌చ్చింది బాల‌య్య‌బాబుతో…

బాల‌య్య కిక్‌కు బొల్తాప‌డ్డ బోయ‌పాటి…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts