బెల్లంకొండ “రాక్ష‌సుడు” ట్రైల‌ర్ ట్రైలర్

July 18, 2019 at 4:47 pm

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరోగా, అనుస‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం రాక్ష‌సుడు. ఈ సినిమా ట్రైల‌ర్ కొద్దిసేప‌టి క్రిత‌మే విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఏ స్టూడియోస్ నిర్మాణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్‌, ఏ హావీష్ ప్రోడ‌క్ష‌న్‌లో కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. రాక్షసుడు సినిమాను ర‌మేష్‌వ‌ర్మ పెనుమ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈచిత్రం ట్రైల‌ర్‌తో సినిమాపై హైప్ క్రియోట్ అవుతుంద‌నే చెప్పోచు.

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాలో ఓ ఫ‌వ‌ర్‌పుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించిన‌ట్లు ట్రైల‌ర్‌లో చూపారు. సినిమా ట్రైల‌ర్ ప్రారంభంలోనే నేనంటే భ‌యానికే భ‌యం… న‌న్ను ప‌ట్టుకోవాల‌నుకోకు… ప‌ట్టుకుందామ‌నుకున్నా అది నేనివ్వ‌నూ… అంటూ ట్రైల‌ర్ ప్రారంభం అవుతుంది. అంటే ఈ సినిమాలో ఓ క్రైంథ్రిల్ల‌ర్ సినిమాగా అనిపించ‌క మాన‌దు. 

ఇక రాక్ష‌సుడు సినిమా ట్రైల‌ర్‌లో ఓ మ‌తిస్థిమితం లేని వ్య‌క్తి వ‌రుస‌గా ప‌థ‌కం ప్ర‌కారం హ‌త్య‌లు చేస్తున్న‌ట్లు, ఆ హంత‌కుడ్ని సాయి శ్రీ‌నివాస్ ఓ పోలీసాఫీస‌ర్‌గా వెంట‌ప‌డ‌టం, అయినా కేవ‌లం స్కూల్ విద్యార్థులే హ‌త్య‌కు గురికావ‌డం చూస్తుంటే ఈ సినిమా ట్రైల‌ర్‌తో సినిమా హిట్ అవుతుంద‌నే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ గ‌తంలో న‌టించిన సాక్ష్యం సినిమా మాదిరిగా న‌మ్మ‌కాల‌పై కాకుండా ఈసారి య‌థార్థ గాధ‌ను తెర‌కెక్కించిన‌ట్లుగా క‌నిపిస్తుంది. ఇటీవ‌ల పాఠ‌శాల పిల్ల‌ల‌పై ఓ మృగాడు లైంగిక‌దాడి చేసి హ‌త్య చేసిన ఉదంతాన్ని తెర‌కెక్కించిన‌ట్లు తెలుస్తుంది. సో ఈ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటుంద‌నే చొప్పొచ్చు.

 
బెల్లంకొండ “రాక్ష‌సుడు” ట్రైల‌ర్ ట్రైలర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts