బోయ‌పాటికి టాప్ ప్రొడ్యుస‌ర్ షాక్‌!

July 12, 2019 at 10:07 am

టాలీవుడ్ లో బోయపాటి శ్రీను పేరు చెపితే వినయ విధేయ రామ సినిమాకు ముందు వరకు అతడు ఖచ్చితంగా టాప్ డైరెక్టర్ల లిస్టు లో ఉండేవాడు. బోయపాటితో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం క్యూలో ఉండే పరిస్థితి. ఇప్పుడున్న యంగ్ స్టర్స్ మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే బోయపాటి శ్రీను కరెక్ట్ అని భావించేవారు. అల్లు అర్జున్ లాంటి క్లాస్ హీరోను కూడా సరైనోడు సినిమాతో మాస్ గా చూపించి సూపర్ హిట్ ఇచ్చిన ఘనత బోయ‌పాటికే దక్కింది. అలాంటి బోయ‌పాటి సీన్ వినయ విధేయ రామ‌తో బోల్తా పడింది.

చివరకు ఈ సినిమా రిలీజయ్యాక తాను చాలా తప్పు చేశానని హీరో రామ్ చరణ్ తన అభిమానులకు క్షమాపణలు చెబుతూ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశాడు. దీనిని బ‌ట్టి బోయపాటి ఎంత ఘోరమైన అవమానం ఎదుర్కొన్నాడో అర్థం చేసుకోవ‌చ్చు. ఇదిలా ఉంటే ఇప్పుడు బోయ‌పాటికి ఛాన్స్ ఇచ్చేందుకు ఏ హీరో… నిర్మాత కూడా సిద్ధంగా లేరు. ఈ క్రమంలోనే తన తొలి సినిమా నిర్మాత దిల్ రాజు దగ్గరికి వెళ్లి ఓ సినిమా చేస్తానని రూ. 60 నుంచి 70 కోట్ల బడ్జెట్ అవుతుందని చెప్పాడట.

బోయపాటితో సినిమా చేస్తానని చెప్పిన దిల్ రాజు ముందు నువ్వు కథ చెప్పు… నీ కథను బట్టి ఎంత ? బడ్జెట్ పెడితే నాకు వర్కౌట్ అవుతుందో నేను చెప్తాను. ముందు నువ్వు బడ్జెట్ చెప్పకు… సబ్జెక్ట్ చెప్పు అనగానే దిమ్మతిరిగినంత పనయింది అట. ఎంత ఖర్చు పెడితే ఒక సినిమాకి ప్రాఫిట్ వస్తుందో తనకు ఖ‌చ్చితంగా తెలుసు కనుక నువ్వు చెప్పిన కథకు… ఎంత బడ్జెట్ ఇవ్వాలన్నది తాను డిసైడ్ చేస్తానని చెప్పాడట.

ముందుగా నువ్వు బడ్జెట్ ఫిక్స్ చేసుకుని నా దగ్గరికి వస్తే కుదరదని చెప్పడంతో… చేసేది లేక బోయ‌పాటి నిరాశతో వెనుదిరిగినట్టు తెలుస్తోంది. ఇక బడ్జెట్ విషయంలోనే తేడా రావ‌డంతో బాలయ్యతో బోయపాటి సినిమా ఆగిపోయింది. చివ‌ర‌కు బాలయ్య వెంటనే కె.ఎస్.రవికుమార్ సినిమాను పట్టాలెక్కిన సంగతి తెలిసిందే.

బోయ‌పాటికి టాప్ ప్రొడ్యుస‌ర్ షాక్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts