బాబు మెడ‌కు “60-సీ“ ఏం జ‌రుగుతుంది?

July 18, 2019 at 12:33 pm

రాష్ట్రంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌నో వేదన కు గురవుతున్నార‌ని తెలుస్తోంది. నేనెవ‌రికీ భ‌య‌ప‌డ‌ను!! అని భీష్మించిన ఆయ‌నే ఇప్పుడు .. “60-సీ“అనే నిబంధ‌న‌కు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాను సంపూర్ణంగా అమ‌లు చేసిన 60-సీ వ‌ల్ల ఇప్పుడు త‌న‌కే స‌మ‌స్య‌లు ఎదురు కావ‌డంపై ఆయ‌న మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. కొత్త‌గా వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం.. ఏపీలో మ‌హ త్త‌ర‌మైన పాల‌న అందిస్తామ‌ని ప్ర‌తిన పూనింది. ఈ క్ర‌మంలోనే అవినీతి ర‌హిత‌, పార‌ద‌ర్శ‌క‌మైన పాల‌న అందించేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. 

ఈ క్ర‌మంలోనే గ‌త ప్ర‌భుత్వం చేసిన దుబారాను ప్ర‌స్తుతం క‌ట్ట‌డి చేసిన జ‌గ‌న్‌.. నీళ్ల ద‌గ్గ‌ర నుంచి హైఫై సౌక‌ర్యాల వ‌ర‌కు కూడా అన్నింటా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో గ‌త ప్ర‌బుత్వం చేసిన దుబారాను, ముఖ్యంగా కాం ట్రాక్ట‌ర్ల‌కు దోచి పెట్టార‌ని, త‌ద్వారా దొడ్డి మార్గంలో చంద్ర‌బాబు సొమ్ము చేసుకున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.ఈ క్ర‌మం లోనే ఆయ‌న 60-సీ నిబంధ‌న‌ల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నార‌ని తాజాగా వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపిస్తోంది. 60-సీ.. అంటే.. ఎవరైనా కాంట్రాక్టరు ఇచ్చిన పనిని సకాలంలో చేయడంలో విఫలమైతే.. 60సీ నోటీసివ్వడం ద్వారా అతడి నుంచి కొన్ని పనులను తొలగించి.. వేరే కాంట్రాక్టరుకు అప్పగిస్తారు. 

అయితే, ఈనిబంధ‌న‌ను అడ్డు పెట్టుకుని చంద్ర‌బాబు ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించార‌నేది వైసీపీ ప్ర‌ధాన ఆరోప‌ణ‌. గత ఐదేళ్లలో 60సీ నిబంధనలను అడ్డంపెట్టుకుని బాబు ప్రభుత్వం ఎన్నో అక్రమాలకు ఒడిగట్టిందని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ స్వ‌యంగా స‌భ‌లోనే ఆరోపించారు. గత ప్రభుత్వం రూ.16 వేల కోట్ల అంచనాలను రూ.36 వేల కోట్లకు పెంచి తమకు కావలసినవారికి కట్టబెట్టిందని తెలిపారు. ఆ అక్రమాలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయన్నారు. అవసరమైన చోట రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. జ్యుడీషియల్‌ కమిటీ ద్వారా టెండర్లు నిర్వహిస్తామని, సబ్‌ కమిటీ వేసి సమీక్ష చేస్తామన్నారు. నాలుగున్నరేళ్లు ఖాళీగా ఉండి ఆఖరి ఆరు నెలల్లో రూ.20 వేల కోట్ల పనులు మంజూరుచేసి.. అధిక అంచనాలతో తమ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ ప‌రిణామంతో చంద్ర‌బాబుకు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని 60-సీ ఆయ‌న‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

 
 
బాబు మెడ‌కు “60-సీ“ ఏం జ‌రుగుతుంది?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts