బాబు న‌మ్మిన హీరోలు ఆయ‌న్నే జీరోను చేశారా..

July 10, 2019 at 3:14 pm

న‌మ్మ‌కం లేక పోతే.. రాజకీయ‌మే లేదు. నాయ‌కుల‌ను అధినేత‌, అదినేత‌ను నాయ‌కులు న‌మ్మిన‌ప్పుడే రాజ‌కీయాలు స‌వ్యంగా సాగేది. అది పార్టీల‌తో సంబంధం లేని వ్య‌వ‌హారం. ఏ పార్టీ అయినా అంతే. నాయ‌కుల‌పై అధినేత గంపెడు ఆశ‌లు పెట్టుకుంటాడు. పార్టీని ఉద్ధ‌రిస్తార‌ని, పార్టీని గెలిపిస్తారని, క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేస్తార‌ని అంద‌రూ అనుకుంటారు. అయితే, ఆ నాయ‌కులే వినాయ‌కులైతే.. అధినేత న‌మ్మిన హీరోలే జీరోలైతే.. ప‌రిస్థితి ఏంటి ? రాజ‌కీయాలు ఎలా ఉంటాయి ? ఇప్పుడు ఇలాంటి ప్ర‌శ్న‌లే ఏపీలో ఘోర ప‌రాజ‌యం చ‌విచూసిన టీడీపీకి ఎదుర‌వుతున్నాయి.

ప‌డ్డ‌వాడు ఎప్పుడూ చెడ్డ‌వాడు కాదు! అంటారు. అలానే ఇప్పుడు టీడీపీ ఓడిపోయి ఉండొచ్చు.. ఆ పార్టీ అధినేతే చెప్పి న‌ట్టుగా .. గెలుపు-ఓట‌ములు టీడీపీకి కొత్త‌కాదు. 40 ఏళ్ల ప్ర‌స్థానంలో అనేక సార్లు గెలిచింది. అనేక సార్లు ఓడింది. ఈ నేప‌థ్యంలోనే అనేక మంది టీడీపీ నేత‌లు పార్టీకి అండ‌గా నిలిచారు. అందుకే ఎన్ని ఓట‌ములు వ‌చ్చినా.. పార్టీ నెట్టుకు వ‌చ్చింది. అయితే, తాజాగా ఎదురైన ఓట‌మి త‌ర్వాత నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో ఇప్పుడు పార్టీలో అంత‌ర్గ‌త చ‌ర్చ ప్రారంభ‌మైంది.

బాబు న‌మ్మిన హీరోలు పార్టీని జీరో చేశారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. అవును! నిజ‌మే.. పార్టీలు మారుతున్న వారిని గ‌తంలో చంద్ర‌బాబు న‌మ్మేవారు కాదు..! ఒక వేళ న‌మ్మినా.. అప్ప‌టి వ‌ర‌కు పార్టీలో ఉన్న వారికే కీల‌క‌మైన బాధ్య‌త‌లు అప్ప‌గించేవారు త‌ప్ప కొత్త‌గా వ‌చ్చిన వారికి నామ‌మాత్ర‌పు ప‌ద‌వులు ఇచ్చి మ‌మ అని అనిపించేవారు. కానీ, 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం త‌ర్వాత రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష‌మే లేకుండా చేయాల‌ని భావించిన చంద్ర‌బాబు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా ఇత‌ర పార్టీల‌కు చెందిన నాయ‌కుల‌ను పార్టీలోకి తీసుకుని వారికి కీలక‌మైన ప‌ద‌వులు అప్ప‌గించారు. అంతేకాదు, మంత్రుల‌ను కూడా చేశారు.

దీంతో వారు బాగానే బాబును అడ్డం పెట్టుకుని సంపాయించుకున్నారు. తీరా పార్టీ ఓట‌మి పాల‌య్యాక‌.. ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. ఇప్పుడు పార్టీలో ఉండ‌డ‌మో.. పోవ‌డ‌మో.. అనే రేంజ్‌లో వారు చ‌ర్చించుకుంటున్నారు. ఈ ప‌రిణామం నిజానికి టీడీపీని అంటిపెట్టుకున్న నాయ‌కుల‌ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. త‌మ‌ను కాద‌ని బాబు వారికి అవ‌కాశం ఇచ్చారు. ఇప్పుడు వారు అవ‌స‌రం తీరాక తెప్ప త‌గ‌లేస్తున్నారు! అని నిట్టూరుస్తున్నారు. నిజ‌మే క‌దా!!సో.. బాబు ఇప్ప‌టికైనా వాస్త‌వాలు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

బాబు న‌మ్మిన హీరోలు ఆయ‌న్నే జీరోను చేశారా..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts