చిరుకు స‌వాల్ విసురుతోన్న కుర్ర హీరో!

July 12, 2019 at 12:04 pm

మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సైరా సినిమా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ కాబోతోంది. చిరు కెరీర్‌లో 151వ సినిమాగా రూ.200 కోట్ల పైచిలుకు బ‌డ్జెట్‌తో తెర‌కెక్కే ఈ సినిమాకు సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆగష్టు 22 వ తేదీన ఆడియో, ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. మెగాస్టార్ సినిమా పైగా అంచనాలు ఉండటంతో.. మిగతా సినిమాలు ఏవి రిలీజ్ కు సిద్దపడటం లేదు.

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఆగ‌స్టు 15న వ‌స్తోన్న సాహో త‌ర్వాత సైరాపైనే భారీ అంచ‌నాలు ఉన్నాయి. పైగా సైరా తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు సైరాకే స‌వాల్ విసిరేందుకు ఓ కుర్ర హీరో రెడీ అవుతున్నాడు. నితిన్ హీరోగా చేస్తున్న భీష్మ సినిమా దసరాకు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. వెంకీ కుడుములు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. మరి భీష్మ సైరాను ఢీకొట్టి నిలబడగలుగుతుందా.. ? నితిన్ ఏ ధైర్యంతో చిరు సినిమాకు పోటీగా వెళుతున్నాడో అర్థం కావ‌డం లేదు. ఇక మ‌రో మోస్ట్ అవైటెడ్ మూవీ సాహోకు పోటీగా ముందువారమే నాగార్జున మ‌న్మ‌థుడు 2 వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.

చిరుకు స‌వాల్ విసురుతోన్న కుర్ర హీరో!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts