జ‌గ‌న్‌తో చేతులు క‌లుప‌నున్న బాల‌కృష్ణ‌…

July 15, 2019 at 4:40 pm

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో హిందూపురం ఎమ్మెల్యే, సిని న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌లు ఒకే వేదిక‌పైకి రాబోతున్నారా..? అధికార ప‌క్షనేత జ‌గ‌న్‌, ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌లు క‌లుసుకోనున్నారా..? బాల‌య్య బాబే కాదు యంగ్ టైగ‌ర్ నంద‌మూరి తార‌క రామ‌రావు కూడా జ‌గ‌న్‌తో చేతులు క‌లుప‌బోతున్నారా..? బాబాయి, అబ్బాయిలు ఇప్పుడు జ‌గ‌న్‌తో చేతులు క‌లుపాల్సినంత అవ‌స‌ర‌మెమొచ్చింది… బావ చంద్ర‌బాబు ఇందుకు ఒప్పుకుంటాడా…? యంగ్ టైగ‌ర్ జ‌గ‌న్‌తో చేతులు క‌లిపితే మామ చంద్ర‌బాబు స‌హిస్తాడా…? అనేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఇంత‌కు జ‌గ‌న్ ను బాల‌య్య‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎక్క‌డ క‌లుసుకోబోతున్నారు…? ఎక్క‌డ చేతులు క‌లుప‌బోతున్నారు…? ఎందుకు క‌లుసుకుంటున్నారు…? అనే ప్ర‌శ్న‌లకు ఇదిగో స‌మాధానం. టీడీపీ ప్ర‌భుత్వం 2014, 2015, 2016 సంవ‌త్స‌రాల‌కు సిని న‌టుల‌కు ఇచ్చే నంది అవార్డులను ప్ర‌క‌టించింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు నంది అవార్డుల ప్ర‌ధానోత్స‌వం మాత్రం నిర్వ‌హించ‌లేదు. దీంతో ఇప్పుడు ఆ నంది అవార్డుల‌ను ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ అంద‌జేయాల‌ని సంక‌ల్పించాడు. త్వ‌ర‌లో నంది అవార్డుల ప్ర‌ధానోత్స‌వం నిర్వహించ‌బోతున్నారు.

అయితే ఈ ప్ర‌ధానోత్స‌వంకు బాల‌య్య‌, జూనియ‌ర్‌ల‌కు ఏమిటి లింక్ అనుకుంటున్నారా..? 2014 సంవ‌త్స‌రానికి ఉత్తమ న‌టుడిగా లెజెండ్ చిత్రానికి గాను బాల‌య్య ఎంపిక అయ్యాడు. 2015 ఏడాదికి శ్రీ‌మంతుడు చిత్రం ద్వారా మ‌హేష్‌బాబు, 2016 ఏడాదికి నాన్న‌కు ప్రేమ‌తో సినిమాకు జూనియ‌ర్ ఎన్టీఆర్‌లు ఉత్త‌మ న‌టులుగా ఎంపిక‌య్యారు… అంటే ఈ అవార్డుల‌ను జ‌గ‌న్ చేతుల మీదుగా అందుకునే కార్య‌క్రమానికి బాల‌య్య‌, మ‌హేష్‌బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్‌లు రానున్నారు. అవి జ‌గ‌న్ చేతుల మీదుగా అందుకోవాల్సిందే.. దీంతో వీరంతా జ‌గ‌న్‌తో క‌లిసి ఒకే వేదిక‌మీద క‌లుసుకుంటారు… క‌ర‌చాల‌నం చేసుకుంటారు… సో జ‌గ‌న్‌తో ఈ ముగ్గురిని ఒకే వేదిక మీద నుంచి చూడాల్సిందే మ‌రి…

జ‌గ‌న్‌తో చేతులు క‌లుప‌నున్న బాల‌కృష్ణ‌…
0 votes, 0.00 avg. rating (0% score)