ధోనీ క్రికెట్‌కు సెల‌వ్‌… సైన్యంలోకి ఎంట్రీ

July 20, 2019 at 3:19 pm

ప్రపంచ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఎన్నో ఆశలతో పార్లమెంటులోకి అడుగుపెట్టిన భారత జట్టు ప్రస్థానం సెమీస్‌లో కీవీస్‌ చేతిలో ఓటమితో ముగిసింది. ప్రపంచకప్‌లో భారత్ ఓటమిపై చాలా విమర్శలు వస్తున్నా ఎక్కువ మంది మాత్రం సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ధోనీ గ‌తంలోలా ఆడ‌లేక‌పోతున్నాడు అని… ముఖ్యంగా కొట్టాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు హిట్టింగ్ చేయలేకపోతున్నాడని సీనియర్ క్రికెటర్లతో పాటు… క్రికెట్ ఎన‌లిస్టులు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆదివారం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత క్రికెట్ జట్టును ఎంపిక చేస్తున్నారు. ఈ జట్టులో ధోనీకి చోటు ఉంటుందా ? లేదా అన్న సందేహం సహజంగానే ఉంది. ఇదిలా ఉంటే వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే జట్టులో ధోనీకి చోటు ఉండదని తెలుస్తోంది. ప్ర‌పంచ‌క‌ప్‌ తర్వాత ధోనీ తనంతట తానుగా రెండు నెలల వరకు క్రికెట్ కు దూరంగా ఉంటానని ముందే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ రెండు నెల‌ల పాటు ధోనీ పారామిలటరీ రెజిమెంట్‌లో చేరి సేవలందించనున్నాడు. ప్రస్తుతం ధోని తన ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించడం లేదు. సెల‌వు మాత్ర‌మే తీసుకుంటున్నాడు.

ఇక ధోనీకి బ‌దులుగా వెస్టిండిస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే భార‌త జ‌ట్టులో యువ వికెట్ కీప‌ర్ రిషిబ్ పంత్ సేవ‌లు అందించ‌నున్నాడు. ఇక టెస్ట్ కీప‌ర్‌గా వృద్ధిమాన్ సాహా పేరు ప‌రిశీల‌న‌కు రావొచ్చని తెలుస్తోంది. ఏదేమైనా 38 ఏళ్ల‌కు చేరువ అయిన ధోనీ ఇప్ప‌ట‌కీ అయినా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాల‌ని అన్ని వైపులా నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ధోనీకి మాత్రం ఇప్ప‌ట్లో రిటైర్మెంట్ ప్ర‌క‌టించే ఉద్దేశం లేద‌ని తెలుస్తోంది.

ధోనీ క్రికెట్‌కు సెల‌వ్‌… సైన్యంలోకి ఎంట్రీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts