ధోనీకి స‌పోర్ట్‌… టాలీవుడ్ హీరోయిన్‌పై నెటిజ‌న్ల ట్రోలింగ్‌

July 12, 2019 at 12:58 pm

ఎన్నో ఆశలతో ప్రపంచ కప్ టోర్నమెంట్లోకి అడుగుపెట్టిన భారత జట్టు న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్లో ఓడిపోయి కోట్లాది మంది క్రికెట్ అభిమానులను ఎంతో బాధ పెట్టింది. భారత్ ఖ‌చ్చితంగా ఫైనల్ కి వెళ్ళిపోతుంది అని… న్యూజిలాండ్ అసలు భారత్ కు పోటీ కాదని భావించిన వారంతా ఓడిపోవడంతో ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోవటం లేదు. భారత ఓటమిని జీర్ణించుకోలేని సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు మహర్షి సినిమాతో తెలుగులో తాజా హిట్ కొట్టిన పూజా హెగ్డే సెమీఫైనల్ మ్యాచ్ గురించి చేసిన ట్వీట్ లో మాజీ కెప్టెన్ ధోని ప్రశంసించింది.

వాస్తవంగా ధోని ఈ వరల్డ్ కప్ లో అంచనాలు అందుకోలేదు. అందుకే క్రికెట్ మేథావుల‌తో పాటు మీడియా ఎన‌లిస్టులు… దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది క్రీడాభిమానులు ధోనీని విమర్శిస్తున్నారు. టోర్నీ మొత్తం ధోనీ విఫ‌ల‌మైన సంగ‌తి తెలిసిందే. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అయితే అస‌లు మ్యాచ్ ఓడినా ఏం కాద‌న్న‌ట్టుగా ధోనీ ఆడిన‌ట్లు ఉంది. అయితే ఇప్పుడు పూజ ధోనికి సపోర్ట్ గా ట్వీట్ చేయడంతో నెటిజన్లను ఆమెను టార్గెట్గా చేసుకుని ట్రోల్ చేస్తున్నారు.

`భార‌త ఓట‌మి హృద‌యాన్ని ముక్కలు చేసింది. కానీ, ధోనీ నువ్వు నిజ‌మైన ఆట‌గాడివి. నువ్వు నా ఫేవ‌రెట్ ఆట‌గాడివి ఎందుక‌య్యావో మ‌రోసారి నిరూపించావు. భార‌త్‌ను గెలిపించ‌డం కోసం అత‌ను చేయాల్సిందంతా చేశాడు. గెలుపు కోసం చివ‌రివ‌ర‌కు ప్ర‌య‌త్నించాడు. మాజీ నాయ‌కుడికి గౌర‌వం, ప్రేమ‌తో` అంటూ పూజ ట్వీట్ చేసింది. పూజ ట్వీట్‌పై మండిప‌డుతోన్న క్రీడాభిమానులు… ర‌న్‌రేట్ పెరిగిపోతున్న‌ప్పుడు.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న‌ప్పుడు ధోనీ షార్ట్లు ఆడ‌కుండా సింగిల్స్ తీశాడ‌ని.. అలాంటి ధోనీని నువ్వు ఎలా స‌పోర్ట్ చేస్తున్నావ్‌… అస‌లు మ్యాచ్ ఓడిందే ధోనీ వ‌ల్ల అంటూ ఆమెపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ధోనీకి స‌పోర్ట్‌… టాలీవుడ్ హీరోయిన్‌పై నెటిజ‌న్ల ట్రోలింగ్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts