దొర‌సాని ట్రైల‌ర్ రిలీజ్‌

July 1, 2019 at 11:32 am

నా ప్రేమ కూడా ఉద్య‌మ‌మే అంటూ ఆనంద్ దేవ‌ర‌కొండ ప్రేమ‌యుద్ధానికి శ్రీ‌కారం చుట్టాడు. స‌న్సేష‌నల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ తెలుగుతెర‌కు ప‌రిచ‌యం అవుతున్న చిత్రం దొర‌సాని. ఈ సినిమా ట్రైల‌ర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

1980కాలంలో తెలంగాణ ప‌ల్లెల్లో దొర‌ల కుటుంబాల నేప‌థ్యం, కుటుంబ స‌భ్యుల ప్రేమ‌లు అనే కథాంశంను ఫాయింట్‌గా తీసుకుని ద‌ర్శ‌కుడు కేవీఆర్ మ‌హేంద్ర చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాలో దొర‌సాని పాత్ర‌దారిగా హీరో రాజ‌శేఖ‌ర్‌, న‌టి జీవిత‌ల చిన్న‌కూతురు శివాత్మిక న‌టిస్తోంది. దొర‌ల కుటుంబానికి చెందిన యువ‌తి అంట‌రానిజాతిలో పుట్టిన ఓయువ‌కున్ని ప్రేమిస్తే జ‌రిగేందేంటి అనే సామాజికాంశంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు మ‌హేంద్ర‌.

ట్రైల‌ర్‌లో నా ప్రేమ కూడా ఉద్య‌మ‌మే అంటూ ఆనంద్ చెప్పిన డైలాగ్‌లు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ట్రైల‌ర్‌లో తెలంగాణ ప్రాంతం, దొర‌ల కుటుంబ జీవిన విధానం, శివాత్మిక లుక్స్‌, ఆనంద్ దేవ‌ర‌కొండ డైలాగ్‌ను క‌ట్ చేసి విజువ‌ల్స్ ను త‌యారు చేశారు. మొత్తానికి ఈ సినిమా తెలంగాణ నేటివీటికి, దొర‌ల కుటుంబాల‌కు, నిరుపేద అంట‌రాని కులాల‌కు న‌డుమ జ‌రిగే ప్రేమ యుద్దం ఎటువైపు దారితీసిందో చూపే ఓ సామాజిక చిత్రంగా చెప్ప‌వ‌చ్చు. ఈ సినిమా ఈనెల‌12న విడుద‌ల చేసేందుకు స‌న్న‌హాలు చేస్తున్నారు. కొస‌మెరుపు ఎంటంటే ద‌ర్శ‌కుడు మ‌హేంద్ర‌, హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, హీరోయిన్ శివాత్మిక‌కు మొద‌టిసినిమా ఈ దొర‌సాని.

దొర‌సాని ట్రైల‌ర్ రిలీజ్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts