అడ‌వి శేష్ క్రైంథ్రిల్ల‌ర్ “ఎవ‌రు” టీజ‌ర్‌

July 19, 2019 at 6:19 pm

అడ‌వి శేష్ న‌టించిన సినిమా ఎవ‌రు. ఈ సినిమా టీజ‌ర్‌ను టాలీవుడ్ హీరోయిన్ అక్కినేని స‌మంత చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఈ సినిమా నిర్మాణం పీవీపీ సినిమాస్‌పై జ‌రిగింది. ద‌ర్శ‌క‌త్వం వెంక‌ట్ రాంజీ వ‌హించారు. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కొద్దిసేప‌టి క్రితం విడుద‌ల కాగా టీజ‌ర్‌ను చూస్తే మంచి అంచ‌నాలే వినిపిస్తున్నాయి. అడ‌వి శేషుతో పాటు రెజినా, మురళీ శ‌ర్మ‌, న‌వీన్ చంద్ర‌తో పాటు ప‌లువురు న‌టిస్తున్నారు.

అడ‌వి శేష్‌, రెజినా జంట‌గా న‌టించిన ఈ సినిమా ఎవ‌రికి అంతుచిక్క‌కుండా, క‌నీసం సినిమా నిర్మాణం జ‌రుపుకుంటున్న దాఖాలాలు కూడా ఎవ‌రికి తెలియ‌ని విధంగా జ‌రిగింద‌నే చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన త‌రువాత ఆక‌స్మాత్తుగా అడ‌వి శేష్ ఒక సంద‌ర్భంలో ఫ‌స్ట్ లుక్ విడుదల చేయ‌డంతో అంద‌రికి ఎవ‌రు అనే సినిమా వ‌స్తుంద‌నే విష‌యం బ‌య‌టికి పొక్కింది.

ఇక ఎవ‌రు సినిమాలో అడ‌వి శేషు త‌మిళ‌నాడు రాష్ట్ర పోలీసు ఆఫీస‌ర్‌గా న‌టించాడు. విక్ర‌మ్ వాసుదేవ్ త‌మిళ‌నాడు స్టేట్ పోలీస్ … నిజాలు మాట్లాడుకుందాం అంటూ శేషు డైలాగ్‌ను టీజ‌ర్‌లో వ‌దిలారు. ఇక రెజినా ఒంటిపై గాయాల‌తో క‌నిపిస్తుంది. ఇది ఎవ‌రు చేసారు… ఎందుకు చేశారు… అనేది స‌స్పెన్స్‌గా ఉంది. ఇంకో ప్రేమ్‌లో ఇది పోలీస్ మ‌ర్డ‌ర్ అంటూ అడ‌వి శేషు డైలాగ్ వినిపిస్తుంది. అంటే ఇది పోలీస్‌ను హత్య చేశారా… లేక పోలీసే మ‌ర్డ‌ర్ చేశారా అనేది స‌స్పెన్స్‌గా టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇక సినిమా ఓ క్రైంథ్రిల్ల‌ర్ సినిమాగా రూపుదిద్దుకున్న‌ట్లు తెలుస్తుంది. టీజ‌ర్‌ను ఒక నిమిషం ప‌ద‌కొండు సెకండ్లు మాత్రం విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌తో సినిమాపై హైప్ క్రియోట్ కావ‌డం ఖాయం.

అడ‌వి శేష్ క్రైంథ్రిల్ల‌ర్ “ఎవ‌రు” టీజ‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts