ఫ్రెంచ్ కిస్‌తో ఇంత డేంజ‌రా…!

July 20, 2019 at 11:44 am

ముద్దు ఇద్దరి మధ్య ప్రేమకు చిహ్నం. ఆనందాన్ని పంచే పులకింత ఎదుటివారికి ఓ పలకరింత. ఈ ముద్దు లో అనేక రకాలు ఉన్నాయి. ఆనందంతో పెట్టే ముద్దులు కొన్ని అయితే ప్రేమ కురిపించేవి మరికొన్ని. ముద్దు అనేది మానసిక… శారీరక ఆరోగ్యాల‌ విషయంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ ముద్దుల్లో ఫ్రెంచ్ కిస్ ( అద‌ర చుంబ‌నం) తో అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడవటం అందరినీ కలవరపాటుకు గురి చేస్తోంది.

ఫ్రెంచ్ కిస్ తో ముఖ్యంగా గనేరియా వంటి సుఖ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వెల్లడైంది. సహజంగా ఆనారోగ్యకరమైన లైంగిక సంబంధాల ద్వారా గనేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అయితే ఫ్రెంచ్ కిస్‌ వల్ల కూడా ఈ వ్యాధి వస్తుందని…. ఈ కిస్ వల్ల గనేరియాతో పాటు మరో ఐదు ర‌కాల‌ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు తాజా అధ్యయనంలో స్పష్టమైంది.

కొన్ని నెలలుగా లైంగిక చర్యలో పాల్గొనకుండా ఉన్న వ్యక్తుల‌కు గనేరియా వ్యాధి సోకడంతో ద్వారానే వారికి ఈ వ్యాధి ఫ్రెంచ్ కిస్ ద్వారానే సంక్రమించింది అన్న విషయాన్ని కూడా గుర్తించారు. ఈ వ్యాధి వల్ల గొంతు… రక్తంపై ప్రభావం చూపే మరో ఐదు వ్యాధులకు కూడా కారణం అయ్యే ప్రమాదం ఉందని స్పష్టం అయింది.
ఇక గనేరియా ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుండటంతో…. ముద్దు వల్ల కూడా ఈ ప్రమాదకర వ్యాధి వ్యాప్తి చెందుతుంది అన్న విషయం పై ప్రజల్లో అవగాహన కలిగించాలని….. దీని నివారణకు యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్ లాంటి కొత్త నియంత్రణ పద్ధతులు అనుసరించాల్సిన అవసరం ఉందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఫ్రెంచ్ కిస్‌తో ఇంత డేంజ‌రా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts