కోహ్లీ సేన ఓట‌మితో రూ.1000 కోట్లు మ‌టాష్‌

July 11, 2019 at 3:58 pm

ప్ర‌పంచ‌క‌ప్‌లో మిగిలిన దేశాల మ్యాచ్‌లు ఒక ఎత్తు… ఇండియా ఆడే మ్యాచ్‌లు ఒక ఎత్తు. ఇండియా ఆడుతుందంటే ఐసీసీకి పండ‌గే. కోట్లాది మంది మ్యాచ్‌ను వీక్షిస్తుంటారు. ఆ మ్యాచ్‌ల‌కు యాడ్ టారిఫ్ కూడా ఓ రేంజులో ఉంటుంది. ఇక ఇండియా మ్యాచ్‌ల‌కు స్టేడియాలు అన్ని ఫుల్ అయిపోతుంటాయి. ఇక ఇండియా ఆడుతుందంటే బెట్టింగులు ఏ రేంజులో జ‌రుగుతుంటాయో ? ప‌్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

దేశ‌వాళీ ఐపీఎల్‌లోనే ప్ర‌తి మ్యాచ్‌కు.. ఇంకా చెప్పాలంటే ప్ర‌తి బాల్‌కు కోట్లాది రూపాయ‌లు చేతులు మారుతుంటాయి. ఇక తాజాగా జ‌రిగిన వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమిపాలైన టీమిండియా కారణంగా లక్షలాది మంది వందల కోట్లు పోగొట్టుకున్నట్లుగా తెలుస్తోంది. బెట్టింగ్ ఏజెన్సీలు, జాతీయ మీడియా వ‌ర్గాల క‌థ‌నం ప్ర‌కారం టీం ఇండియా గెలుపుపై ముందు నుంచి అతి ధీమాతో ఉన్న వారు రూ.1000 కోట్ల వ‌ర‌కు జేబులు గుల్ల చేసుకున్నార‌ట‌.

తొలి రోజు కీవీస్ త‌క్కువ స్కోరే చేయ‌డంతో.. రెండో రోజు ఇండియా మ‌ద్ద‌తుదారులు భారీగానే పందేలు కాశారు. ఇండియాపై రూపాయి ఉంటే.. న్యూజిలాండ్ గెలిస్తే ఏకంగా రూ.10 ఇస్తామ‌ని పందేల‌కు దిగారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన బెట్టింగుల్లో బుకీలు ఒక‌టికి రూ.10 వ‌ర‌కు ఇచ్చి మ‌రీ దారుణంగా న‌ష్ట‌పోయారు. అంటే టీమిండియా గెలుపుపై కేవలం రూ. 4.35 బెట్‌ నిర్వహించిన బుకీలు.. కీవీస్‌పై రూ. 10 వ‌ర‌కు ఆఫ‌ర్ చేశార‌ట‌.

ఇండియా గెలిస్తే వ‌చ్చేది రూపాయి అయితే ఓడితే రూ.10 ఇచ్చేలా బెట్టింగ్ న‌డిచింది. ఇప్పుడు ఇండియా ఓట‌మితో భార‌త స‌పోర్ట‌ర్ల డ‌బ్బులు కోట్లాది రూపాయ‌లు ఆవిరి అయిపోయాయి. ఏదేమైనా కోట్లాది అభిమానుల ఆశ‌ల‌ను త‌ల్ల‌కిందులు చేసిన కోహ్లీ సేన కోట్లాది మంది జేబుల‌ను కూడా గుల్ల చేసేసింది.

కోహ్లీ సేన ఓట‌మితో రూ.1000 కోట్లు మ‌టాష్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts