‘ ఇస్మార్ట్ శంక‌ర్ ‘ 2 డేస్ క‌లెక్ష‌న్స్‌… బాక్సాఫీస్‌పై రామ్ – పూరి పంజా

July 20, 2019 at 10:59 am

యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ – పూరి జ‌గ‌న్నాథ్ బాక్సాఫీస్‌పై ఇస్మార్ట్‌గా పంజా విసిరారు. వ‌రుస ప్లాపుల్లో ఉన్న ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్లో వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ అంచ‌నాల‌కు మించి హిట్ అవ్వ‌డంతో పాటు వ‌సూళ్లు రాబ‌డుతోంది. టైర్ 2 స్టార్ హీరోల్లో ఏ హీరోకు రాని విధంగా ఇస్మార్ట్ శంక‌ర్‌కు తొలి రోజు రూ.8 కోట్ల షేర్ వ‌చ్చింది.

శుక్ర‌వారం రెండో రోజు కూడా అదే దూకుడు కంటిన్యూ చేసిన ఇస్మార్ట్ కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 4 కోట్ల షేర్ రాబ‌ట్టింది. అంటే రెండు రోజుల‌కు మొత్తంగా రూ.12 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.18 కోట్ల‌కు అమ్మారు. ఫ‌స్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే స‌రికే బ్రేక్ ఈవెన్ దాటేయ‌వ‌చ్చ‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి.

ఇస్మార్ట్ శంక‌ర్ 2 డేస్‌ క‌లెక్ష‌న్స్ (రూ.కోట్ల‌లో):

నైజాం – 5.39

సీడెడ్ – 1.90

వైజాగ్ – 1.37

ఈస్ట్ – 0.79

వెస్ట్ – 0.61

కృష్ణ – 0.78

గుంటూరు – 0.81

నెల్లూరు – 0.41
————————————–
ఏపీ + తెలంగాణ = 12.06 కోట్లు
————————————–

‘ ఇస్మార్ట్ శంక‌ర్ ‘ 2 డేస్ క‌లెక్ష‌న్స్‌… బాక్సాఫీస్‌పై రామ్ – పూరి పంజా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts