ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ వేడుక‌కు స్టార్ హీరో…?

July 5, 2019 at 10:32 am

ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఓ స్టార్ హీరో ముఖ్య అతిధిగా పాల్గొన్న‌నున్నార‌ట‌. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో వార్త హల్‌ఛ‌ల్ చేస్తోంది. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌తో ఉన్న సాన్నిహిత్యం మేర‌కు ఆ స్టార్ హీరో ముఖ్య అతిధిగా వ‌స్తున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇంత‌కు ఈ స్టార్ హీరో ఎవ్వ‌రు అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌గా ఉన్న‌ది.

రామ్ హీరోగా ఇస్మార్ట్‌శంక‌ర్ సినిమాను పూరి జ‌గ‌న్నాథ్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించారు. ఈసినిమాను పూరి జ‌గ‌న్నాథ్‌, న‌టి చార్మీ ఇద్ద‌రు క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూరి టూరింగ్ టాకీస్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. రామ్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్‌, న‌భ న‌టేష్‌లు న‌టిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ‌గా టాలీవుడ్ నిరాజ‌నాలు అందుకుంటున్న మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాకు సంబందించిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఇప్ప‌టికే రిలీజ్ అయి ఆక‌ట్టుకుంటూ, సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచుతున్నాయి. రామ్ డైలాగ్‌లు, మాస్ క్యారెక్ట‌ర్‌, తెలంగాణ నేటీవీటి, యాస‌, భాష సినిమాకు భారీ హైప్ ను క్రియోట్ చేస్తున్నాయి. అయితే ప్రీ రిలీజ్ వేడుకను వ‌రంగ‌ల్ జిల్లాలోని హ‌న్మ‌కొండ ప‌ట్ట‌ణంలో భారీగా నిర్వ‌హించేందుకు స‌న్న‌హాలు చేస్తున్నారు. బోనాల పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుక‌కు పూరి జ‌గ‌న్నాథ్ సినిమాలో ప‌లు చిత్రాల్లో హీరోగా న‌టించిన ప్ర‌ముఖ హీరో ముఖ్య అతిధిగా రానున్నార‌ట‌. అయితే ఈ స్టార్ హీరో ఎవ‌రు అనేది ఈనెల 7న తెలియ‌నున్న‌ది.

ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ వేడుక‌కు స్టార్ హీరో…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts