‘ ఇస్మార్ట్ శంక‌ర్ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌

July 18, 2019 at 10:01 am

పూరి జగన్నాథ్ – రామ్ పోతినేని కాంబినేషన్లో నిధి అగర్వాల్, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా తెరకెక్కిన పక్కా మాస్ మసాలా సినిమా ఇస్మార్ట్ శంకర్. గత కొన్ని సంవత్సరాలుగా వరుస ప్లాపులతో ఉన్న పూరి – రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాపై ఇద్దరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రిలీజ్ కు ముందే మాస్… యూత్ లో అంచనాలు పెంచిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఫ‌స్ట్ షో తర్వాత ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందో చూద్దాం.

క‌థా ప‌రంగా చూస్తే ఒక సిబిఐ గ్యాంగ్ నటుడు సత్యదేవ్ మెమొరీను ఉస్తాద్ శంకర్(రామ్) అనే ఓ హైదరాబాద్ కుర్రాడి తలలోకి ఓ మెడికల్ సర్జరీ ద్వారా మారుస్తారు. హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ మెద‌డుకు సంబంధించ‌న రీసెర్చెర్‌గా క‌నిపిస్తుంది. సీబీఐ రామ్ త‌ల‌లోకి చిప్ ఎందుకు పెట్టింది ?  దీనికి రీసెర్చెర్ నిధికి ఉన్న సంబంధం ఏంట‌నేది ?  ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఇప్ప‌టికే గ‌త కొన్నేళ్లుగా పూరి సినిమాలు టేకింగ్‌, స్క్రీన్ ప్లే ప‌రంగా చాలా నాసిర‌కంగా ఉంటున్నాయి. ఈ సినిమా చూస్తే కూడా పూరి మార‌లేద‌నే అనిపిస్తుంది. సినిమా స్టార్టింగ్ ఆస‌క్తిగానే ఉన్నా సినిమా న‌డిచిన కొద్ది టేకింగ్ స‌రిగా లేక‌… క‌న్‌ఫ్యూజ్ స్క్రీన్‌ప్లేతో సినిమా విసిగించేస్తుంది. సినిమాలో ట్విస్టులు, చాలా సీన్లు సామాన్య ప్రేక్ష‌కులు కూడా ముందే ఊహించేస్తారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా ముందు గానే ప్రేక్షకుడికి అర్ధం అయ్యిపోవడం వంటివి పూరి అభిమానులను కాస్త నిరాశ పరుస్తాయి.

ఈ సినిమాలో ఉన్న కొత్త పాయింట్ ఏంటంటే రామ్‌ను పూరి స‌రికొత్త హైద‌రాబాదీ కుర్రాడిగా చూపించ‌డం ఒక్క‌టే. ఏదేమైనా తొలి ఆట‌కే సినిమాకు స‌రైన టాక్ లేదు. సోలో రిలీజ్‌తో వ‌చ్చిన శంక‌ర్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వీక్ కంటెంట్తో ఎంత వ‌ర‌కు స‌త్తా చాటుతుందో ?  చూడాలి.

‘ ఇస్మార్ట్ శంక‌ర్ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts