జ్యోతిక జాక్‌పాట్ ట్రైల‌ర్‌…!

July 29, 2019 at 12:04 pm

చంధ్ర‌ముఖి సినిమాలో డేరింగ్ న‌ట‌న‌తో అంద‌రిని మెప్పించిన జ్యోతిక ఇప్పుడు జాక్‌పాట్ పేరిట తెలుగులో సినిమా త్వ‌ర‌లో విడుద‌ల చేసేందుకు స‌న్న‌హాలు చేస్తున్నారు. అందులో భాగంగా జ్యోతిక న‌టించిన జాక్‌పాట్ సినిమా ట్రైల‌ర్, ఆడియోను ఈ రోజు చెన్నైలో విడుద‌ల చేశారు.

పెళ్ళ‌యిన త‌రువాత కొన్ని ఎంపిక చేసుకున్న సినిమాల్లోనే న‌టిస్తున్న జ్యోతిక ఇప్పుడు త‌మిళంలో న‌టించిన ఈ సినిమాను తెలుగులో డ‌బ్బింగ్ చేస్తున్నారు. జాక్‌పాట్ సినిమాలో జ్యోతిక‌తో పాటు రేవ‌తి న‌టిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తే త‌మిళ వాస‌న లేకుండా తెలుగు సినిమా చూసిన అనుభూతే క‌లుగుతుంది. ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ సినిమా ట్రైల‌ర్‌ను చాలా జాగ్ర‌త్త‌గా రూపొందించార‌ని అర్థం అవుతుంది.

జ్యోతిక‌, రేవ‌తి న‌టించిన ఈ సినిమాను జ్యోతిక భ‌ర్త న‌టుడు సూర్య నిర్మిస్తున్నాడు. 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సూర్య నిర్మాత‌గా, క‌ళ్యాణ్ ద‌ర్శ‌క‌త్వంలో, విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతంలో సినిమా ట్రైల‌ర్ ఎంతో యాక్ష‌న్‌, ఫ‌న్‌లో జ్యోతిక ఇర‌గ‌దీసింద‌ట‌. జ్యోతిక‌, ఇటు రేవ‌తి ఇద్ద‌రు తెలుగు తెర‌కు బాగా ప‌రిచ‌యం ఉన్న హీరోయిన్లే కావ‌డంతో ఈ జాక్‌పాట్ తో తెలుగులో జాక్‌పాట్ కొట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. సినిమాను త్వ‌ర‌లో విడుద‌ల చేయనున్నారు.

జ్యోతిక జాక్‌పాట్ ట్రైల‌ర్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts