సీనియ‌ర్ మంత్రిపై జ‌గ‌న్ గుస్సా..!

July 16, 2019 at 5:33 pm

రాష్ట్రంలో అధికారం చేప‌ట్టిన త‌ర్వాత వైఎస్ జ‌గ‌న్ పాల‌నలో తాన మార్క్ చూపుతున్నారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, అవినీతి రహిత పాలనే ల‌క్ష్యంగా ముందుకుసాగుతున్నారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదంటూ సొంత పార్టీ నేత‌ల‌కు కూడా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అయితే ఇటీవ‌ల జరిగిన కేబినేట్‌లోని కొంద‌రు మంత్రులు బదిలీల్లో ఆమ్యామ్యాల‌కు తెర‌లేపారని గుస‌గుస‌లు వినిపించాయి.

ఇవి కాస్తా ఆనోటా..ఈనోటా సీఎం జ‌గ‌న్ దాకా చేర‌డంతో ఆయ‌న ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లు స‌మాచారం. వెంట‌నే ఆ అయిదుగురు మంత్రులను పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చార‌ని ప్రచారం జ‌రుగుతోంది. అయితే ఆ అయిదుగురు మంత్రులు ఎవ‌రై ఉంటార‌నే అటు పార్టీలో, ఇటు బ‌య‌ట ఒక‌టే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప టికీ వారి పేర్లు మాత్రం బయటకు రాకపోయినా, అందులో ఒకరు మాత్రం సీనియర్ మంత్రి ఉన్నార‌ని, జగన్ తండ్రి వైఎస్సార్ మంత్రివర్గంలో కూడా స‌ద‌రు ఆమాత్యుడు పని చేశార‌ని నేత‌లు చెవులుకొరుక్కుంటున్నారు.

ఇంత‌కీ మరి ఆ మంత్రి ఎవర‌న్న‌ది మాత్రం సస్పెన్స్‌గా మిగిలింది. జగన్ క్యాబినేట్లో అయిదుగురు మంత్రులు ఆయన తండ్రి వైఎస్సార్ దగ్గర కూడా పనిచేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస‌రెడ్డి, మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ ఇప్పుడు జగన్ క్యాబినెట్లో కూడా కొనసాగుతున్నారు. అయితే వీరిలో జగన్ సీరియస్ అయినట్లుగా ప్రచారంలో ఉన్నమంత్రి ఎవరు అన్నదే పెద్ద చర్చ.

ఆ సీనియర్ మంత్రి తన సొంత జిల్లాలో అంతా తానే అయి చక్రం తిప్పుతున్నార‌ని, ఆయ‌నే మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బొత్స త‌న సొంత జిల్లా విజయనగరంలో హవా కొన‌సాగుతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. జగన్ బొత్సపై సీరియస్ అయ్యార‌న్న వార్త ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అదే జరిగితే ఇక బొత్స రాజకీయ దూకుడుకు ఇక చెక్ ప‌డిపోవడం ఖాయమని అంటున్నారు.

సీనియ‌ర్ మంత్రిపై జ‌గ‌న్ గుస్సా..!
0 votes, 0.00 avg. rating (0% score)