టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ పై జ‌గ‌ప‌తిబాబు ఆగ్ర‌హం… ?

July 17, 2019 at 11:57 am

మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత మహేష్ బాబు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో న‌టిస్తోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు – అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా నుంచి సీనియర్ హీరో జగపతిబాబు తప్పుకున్నట్లు తెలుస్తోంది. కశ్మీర్ లో మరో సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ తో పాటు జగపతిబాబు.. మహేష్‌బాబు పాల్గొంటున్నారు.

జ‌గ‌ప‌తిబాబు స‌డెన్‌గా షూటింగ్ నుంచి ఎందుకు బయటికి వచ్చేశాడో ఎవరికీ అర్థం కాలేదు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అనిల్ రావిపూడి ముందుగా చెప్పినట్టు కాకుండా వేరే సీన్లు షూట్ చేస్తుండడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యార‌ని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు షూటింగ్ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

జ‌గ‌ప‌తిబాబు ప్లేస్‌లోకి ప్ర‌కాశ్‌రాజ్‌ను తీసుకున్నార‌ని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించే సన్నివేశాలనే మాత్రామే షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ స‌ర‌స‌న క‌న్న‌డ క‌స్తూరి ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా చేస్తోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. వ‌చ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు.

 
 
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ పై జ‌గ‌ప‌తిబాబు ఆగ్ర‌హం… ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts